పవర్ స్టార్ దెబ్బ కి షాకవుతున్న రెబల్ స్టార్ ప్రభాస్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తూ వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 2021 సంక్రాంతి కి రిలీజ్ చేసేలా నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమా కాకుండా మరో 5 ప్రాజెక్ట్స్ కమిటయ్యాడు పవన్ కళ్యాణ్. ఇలా వరసగా కెరీర్ లో ఎప్పుడు లేనంతగా పవన్ కళ్యాణ్ సినిమాలు కమిటవుతుండటం చూసి అందరూ షాక్ లో ఉన్నారంటున్నారు.

Pawan Kalyan looks intense as lawyer in 'Vakeel Saab' motion poster; check  out

ఇక వకీల్ సాబ్ సినిమా పూర్తి చేసి క్రిష్ తెరకెక్కించనున్న పీరియాడికల్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడట. ఏఎమ్ రత్నం ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నాడు. ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయాలన్నట్టుగా షెడ్యూల్ ప్లాన్ చేశాడ క్రిష్. అలాగే గబ్బర్ సింగ్ కాంబో అయిన హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ ల సినిమా కూడా డిసెంబర్ నుంచే మొదలవబోతుందని సమాచారం. హరీష్ శంకర్ కంప్లీట్ స్క్రిప్ట్ తో సిద్దంగా ఉన్నాడట. పవర్ స్టార్ ఎస్ అనడమే ఆలయంగా ఎదురు చూస్తున్నాడట. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ రెండు సినిమాల తో పాటు కేవలం 25 రోజులు డేట్స్ కేటాయించి…అయ్యప్పయుమ్ కోషియమ్ రీమేక్ ని .. కంపీటయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట పవన్ కళ్యాణ్. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాతో పాటు బండ్ల గణేష్ నిర్మాణంలో రూపొందనున్న సినిమాలని 2022 సమ్మర్ వరకు పూర్తి చేయాలని భావిస్తున్నాడట. ఇదంతా పవన్ పక్కా ప్రణాళిక వేసుకునే రంగం లోకి దిగుతున్నాడని అంటున్నారు. అయితే మిగతావాళ్ళకంటే డార్లింగ్ ప్రభాస్ పెద్ద షాక్ కి గురౌతున్నట్టు చెప్పుకుంటున్నారు.

Presenting The First Motion Poster of Prabhas and Pooja Hegde's Radhe Shyam  | Filmfare.com

ఇంత పక్కా ప్లాన్ తో ఇన్ని ప్రాజెక్ట్స్ ఎలా కంప్లీట్ చేయడానికి సిద్దమవుతున్నాడు పవర్ స్టార్ అని ఆశ్చర్య పోతున్నాడట ప్రభాస్. ప్రస్తుతం అఫీషియల్ గా ప్రభాస్ కమిటయింది 3 పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్. అన్ని భారీ బడ్జెట్ సినిమాలే. ప్రభాస్ తో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ రెట్టింపు సినిమాలు చేస్తున్నాడు. నిజంగా పవన్ కళ్యాణ్ గ్రేట్ అని ఫీలవుతున్నాడని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. పాన్ ఇండియన్ స్టార్ అయినా కూడా ప్రభాస్ ఇలా మరో హీరోని గొప్పగా చూడటం ప్రభాస్ కే సాధ్యం అయింది.