Sonu Sood: కరోనా కాలంలో మానవత్వానికి ఆదర్శంగా నిలిచిన నటుడు సోనూసూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల్లో ఆయనకు వచ్చిన పేరు కంటే, ఆపత్కాలంలో ఆయన అందించిన సేవను గుర్తుపెట్టుకున్న వారే ఎక్కువ. సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి, ప్రేక్షకులకు కోపం తెప్పించినా, రియల్ లైఫ్‌లో మాత్రం హీరో అనిపించుకొని దాతృత్వాన్ని చాటుకున్నాడు సోనూసూద్. చిత్ర పరిశ్రమలో ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్స్, ఆర్టిస్టులు ఉన్నా కూడా ఆయనలా ఇప్పటివరకూ సాయం చేసిన వారు చాలా తక్కువే. అందుకే ఆయన్ని అందరూ కీర్తిస్తున్నారు.
ఇదిలా ఉండగా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే సోనూసూద్, ఆయన్ను ట్యాగ్ చేస్తూ సాయం కోరిన ప్రతీ ఒక్కరికీ సర్జరీలు చేయించడం, ఆర్థికంగా బాగాలేని వారిని ఆదుకోవడం ఆయనకేమీ కొత్తేమీ కాదు. అలా నెట్టింట్లోనూ స్టార్‌గా ఎదిగిపోయాడు , కృతజ్ఞతలు అందుకుంటున్నారు ఈ స్టార్ హీరో. అందుకే ఆయన గోల్డెన్ హార్ట్ చూసి, సోనూసూద్‌ను రియల్ హీరో అనడంలో ఏ మాత్రం తప్పు లేదని ప్రతీ ఒక్కరూ భావిస్తుంటారు.
यह हर बीवी का जन्म सिद्ध अधिकार है भाई,
मेरी मानो उसी खून से एक ब्लड बैंक खोल लो 🤣 https://t.co/bXOPLzDS74— sonu sood (@SonuSood) April 13, 2022
ఇకపోతే తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. సోదరా సోనూసూద్, మీరు అందరికీ చికిత్స అందేలా చేస్తున్నారు. నా భార్య రోజూ నా రక్తం తాగుతోంది. దానికి ఏదైనా చికిత్స ఉందా ? ఉంటే దయచేసి సహాయం చేయండి సోదరా. ఒక భార్యాబాధితుడిగా చేతులు జోడించి జోడించి మిమ్మల్ని సహాయం కోసం అడుగుతున్నాను’ అంటూ ట్వీట్ చేసిన ఓ నెటిజన్‌కి, సోనూసూద్ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ‘అది ప్రతీ భార్య జన్మహక్కు బ్రదర్, మీరు కూడా నాలాగా అదే రక్తంతో బ్లడ్ బ్యాంక్ ప్రారంభించండి’ అంటూ నవ్వుతున్న ఎమోజీని షేర్ చేశాడి సోనూసూద్.