టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు మాటలు అందించిన త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమా ద్వారా డైరెక్టర్ గా మారాడు. తరుణ్ శ్రేయ జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తాజాగా త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ 7వ తేదీ త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన థియేటర్లలో నాలుగవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు ఈ సినిమాని ప్రసారం చేయనున్నారు.
మాటల రచయితగా ఎన్నో సినిమాలకు తన మాటలను అందించిన త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమా ద్వారా మొదటిసారిగా మెగా ఫోన్ పట్టుకుని దర్శకత్వం వహించాడు. త్రివిక్రమ్ మొదటిసారిగా దర్శకత్వం వహించిన నువ్వే నువ్వే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. థియేటర్ లో ఈ సినిమాని చూడని వారికి ఈ సినిమాని మళ్లీ అందిస్తున్నారు.’నువ్వే నువ్వే’ రీ రిలీజ్ సందర్భంగా ఈ సినిమా నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ…” దర్శకుడు త్రివిక్రమ్‌కు అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్ డే” అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.
‘నువ్వే నువ్వే’ విడుదలై 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా స్పెషల్ షో వేసినప్పుడు వచ్చిన స్పందన నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులకూ ఆ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం కోసం మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం. 2కె హెచ్‌డి ప్రింట్‌తో ఈ సినిమా రీ రిలీజ్ చేస్తున్నాం. సినిమా రిలీజ్ చేసే థియేటర్ల వివరాలు తొందరలోనే వెల్లడిస్తామని రవి కిషోర్ చెప్పుకొచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్ మాట్లాడుతూ నాలో ఉన్న రచయితని, దర్శకుడుని నాకన్నా ముందుగా గుర్తించిన రవి కిషోర్ గారికి నా ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతోంది.