టాలీవుడ్ హీరో కం బ్యాక్ ఇవ్వాలంటూ ఫాన్స్ డిమాండ్

ఇరవై ఏళ్ళ క్రితం టాలీవుడ్ కి చాలా మంది కొత్త హీరోలు వచ్చారు. కానీ అందరు అనుకున్నంత సక్సెస్ కాలేదు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని అతి తక్కువ కాలంలో స్టార్ హీరో అయినా వారిలో ఒకడు తరుణ్. అప్పట్లో తరుణ్ కి ఉన్నంత క్రేజ్ మహేష్ బాబు, ఎన్టీఆర్ కి కూడా లేదు. కానీ అంతే త్వరగా ఫేడ్ అవుట్ అయిపోయాడు.

తరుణ్ హీరోగా నటించిన ‘నువ్వే నువ్వే’ సినిమా  విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ కి హీరో, డైరెక్టర్ తో పాటుగా, టీమ్ అంతా హాజరైన సంగతి అందరికీ తెలిసిందే.

తరుణ్ ఇప్పటికీ అలాగే యంగ్ గా ఉండడంతో తరుణ్ కమ్ బ్యాక్ ఇవ్వాలి అని ఫాన్స్ డిమాండ్ చేస్తున్నారు. తరుణ్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అని, అతనికి మరోసారి అవకాశం ఇవ్వాలి అని తెలిపారు. మరి తరుణ్ కమ్ బ్యాక్ ఇస్తారో లేదో చూడాలి.