నువ్వే నువ్వే సినిమా అడ్వాన్స్ తో త్రివిక్రమ్ ఏం చేశారో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటలు మాంత్రికుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.రచయితగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన నువ్వే నువ్వే సినిమా ద్వారా దర్శకుడిగా మారారు.ఈ విధంగా ఈయన దర్శకుడుగా మారి 20 సంవత్సరాలు పూర్తి కావడంతో నువ్వే నువ్వే చిత్ర బృందం పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ క్రమంలోనే నువ్వే నువ్వే నిర్మాత స్రవంతి రవి కిషోర్ తో పాటు హీరో హీరోయిన్లు ఇతర చిత్ర బృందం హైదరాబాద్లో ఈ సినిమాని  ఎ.ఎం.బి. సినిమాస్‌లో ప్రత్యేక ప్రదర్శన చూశారు.

ఇక ఈ సినిమా చూసిన అనంతరం మీడియాతో మాట్లాడినటువంటి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. వనమాలి హౌస్ లో తాను రచించిన నువ్వే కావాల్సిన షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ హౌస్ పక్కన కాలి స్థలం ఉండగా అందులో నేను నిర్మాత రవి కిషోర్ అటు ఇటు తిరుగుతూ ఉన్నాము. అదే సమయంలోనే తాను నిర్మాతకు నువ్వే నువ్వే సినిమా కథ చెప్పాను. ఈ కథ విన్న వెంటనే రవికిషోర్ చెక్ బుక్ ఇచ్చి నువ్వే కావాలి సినిమాకు కథ రాసినందుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నానో నువ్వే నువ్వే సినిమాకు అంత అడ్వాన్స్ ఇచ్చారు.

ఈ విధంగా ఆయన నన్ను నమ్మి నాపై ఎంతో నమ్మకం ఉంచి ఇలా కథ చెప్పగానే వెంటనే అడ్వాన్స్ ఇచ్చారు. అందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సందర్భంగా నిర్మాత రవి కిషోర్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక తనకు అడ్వాన్స్ గా ఇచ్చిన ఆ డబ్బుతో ఒక బైక్ కొన్నానని ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలిపారు. ఇక ఈ సినిమాలో పాటల గురించి మాట్లాడుతూ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి కూడా ప్రస్తావించారు. ఇందులో ఆయన రాసిన ప్రతి ఒక్క పాట ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయని తెలుపుతూ ఇలాంటి ఓ గొప్ప చిత్రానికి పాటలు అందించిన సిరివెన్నెల గారికి ఈ సినిమాని అంకితం చేశారు.