Ravi Teja: శర్వా సినిమా లెక్క సరిచేయనున్న రవితేజ..!

Ravi Teja: శర్వానంద్ ఇటీవలే రష్మికతో కలిసి నటించిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమా ట్రైలర్ చూసి అంచనాలు పెంచుకున్నారు అభిమానులు. అయితే సినిమా మాత్రం ఆశించినంత విజయం సాధించలేదు. సినిమా మొదటి వారంలోనే చేతులెత్తేసింది. ఇక మార్చి నెలలో పెద్ద సినిమాలు విడుదల అవుతుండడం మరింత సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపింది.దీంతో సినిమాను ఓటిటి లో విడుదల చేయడానికి చిత్రా యూనిట్ భావిస్తోంది.

ఇక ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను శ్రీ లక్ష్మి వేంకటేశ్వర బ్యానర్ పై నిర్మించారు.ఇక రవితేజ కొత్త చిత్రం రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ద్వారా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు రవితేజ సినిమా ద్వారా నిర్మాత హామీ ఇస్తున్నారట. సినిమా మినిమం అయినా తెస్తుంది కాబట్టి నష్టాలను పుడ్చవచ్చని అనుకుంటున్నారు.

ఇక రవితేజ ఈ సినిమాలో డిప్యూటీ కలెక్టర్ పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్ డ్రామా గా ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. న్యాయం చేయడానికి ఎంత దూరమైనా వెళ్లే డిప్యూటీ కలెక్టర్ గా రవితేజ మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఇక రవితేజకు జోడిగా రజీషా విజయన్, దివ్యంషా కౌశిక్ నటిస్తున్నారు. శరత్ మండవ ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ గా టాలీవుడ్ కి పరిచయమవుతున్నారు. ఇటీవలే విడుదలైన చిత్రా ట్రైలర్ సినిమా పై అంచనాలను బాగానే పెంచాయి. చూడాలి మరీ నిర్మాత శర్వానంద్ సినిమా నష్టాలను రవితేజ సినిమా ద్వారా సరిచేస్తారో లేదో.