Gallery

Home News రవితేజ - బాలకృష్ణ ఎవరితో ఎవరికి పోటీ తెలుసా...?

రవితేజ – బాలకృష్ణ ఎవరితో ఎవరికి పోటీ తెలుసా…?

రవితేజ – బాలకృష్ణ చాలాకాలం తర్వాత మళ్ళీ ఒకేసారి బాక్సాఫీస్ వద్ద భారీ పోటీకి సిద్దం అవుతున్నారు. క్రాక్ సినిమాతో మాస్ మహారాజ రవితేజ ఫుల్ ఫాం లోకి వచ్చేశాడు. ఈ క్రమంలో రవితేజ డ్యూయల్ రోల్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘ఖిలాడి’ లో నటిస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఖిలాడి తెరకెక్కుతోంది. ‘ప్లే స్మార్ట్’ అన్న ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఖిలాడి సినిమాని పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ గడ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌధరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Whatsapp Image 2021 02 01 At 1.56.20 Pm | Telugu Rajyam

క్రాక్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి గట్టి ధైర్యాన్ని ఇచ్చిన మాస్ మహారాజ రవితేజ అదే ధైర్యంతో తన ఖిలాడి సినిమాని ఈ ఏడాది మే 28 న భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అధికారకంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ ప్రకటించారు. కాగా నందమూరి బాలకృష్ణ – మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బీబీ3 కూడా అదే రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఒకరకంగా ఇది గట్టి పోటీ నెలకొండం కోసమే అన్న టాక్ వినిపిస్తోంది. ప్రగ్యా జైస్వాల్ – పూర్ణ బాలకృష్ణ కి జంటగా నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న బీబీ3 భారీ స్థాయిలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

Nandamuri Balakrishna 696X491 1 | Telugu Rajyam

ప్రస్తుతం బాలకృష్ణ – బోయపాటి మంచి హిట్ కోసం తాపత్రయపడుతున్నారు. ఎలాగైనా ఈ సినిమాతో సాలీడ్ హిట్ కొట్టాలని కసిగా ఈ సినిమా చేస్తున్నారు. ఇక రవితేజ మూడేళ్ళ తర్వాత క్రాక్ తో హిట్ అందుకొని ఫాంలోకి వచ్చాడు. మరి ఈ ఇద్దరిలో బాక్సాఫీస్ వద్ద విన్నర్ గా ఎవరు నిలుస్తారో అని అభిమానులు చెప్పుకుంటున్నారు. కాగా ఇలా రవితేజ – బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద పోటీపడటం 5 వ సారి. గతంలో రవితేజ ‘కృష్ణ’ – బాలకృష్ణ ‘ఒక్కమగాడు’.. ‘మిత్రుడు’ ‘కిక్’..’పరమవీర చక్ర’ ‘మిరపకాయ్’.. ‘వీర’ ‘శ్రీరామరాజ్యం’ సినిమాలతో పోటీ పడ్డారు. త్వరలో ‘బీబీ3’ ‘ఖిలాడీ సినిమాలతో పోటీ పడబోతున్నారు.

- Advertisement -

Related Posts

కోవిడ్ వసూళ్ళు: ప్రభుత్వాల ఆదాయం అదుర్స్.. సామాన్యుడి బెదుర్స్

అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు.. అస్సలేమాత్రం తగ్గట్లేదు. కరోనా నేపథ్యంలో జనం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతోంటే, ప్రభుత్వాలు మాత్రం, ఏదో రకంగా సామాన్యుడి నడ్డి విరిచేందుకు శక్తి వంచన లేకుండా కృషి...

ఏపీ కరోనా అప్డేట్… ఆ రెండు జిల్లాలలో స్వల్పంగా పెరిగిన కేసులు

ఆంధ్ర ప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 85,856 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 2,287 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది....

పెండింగ్ ప్రాజెక్టులపై ఏపీ బీజేపీకి కొత్త ప్రేమ.!

అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై భారతీయ జనతా పార్టీకి వున్న అవగాహన ఏంటి.? ఆ పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ఎలాంటి బాధ్యత కలిగి వున్నారు.? ఈ విషయాలపై రాష్ట్ర ప్రజలకు ఖచ్చితమైన...

Latest News