చూడటానికి చాలా ముద్దుగా బొద్దుగా ఉండే రాశీ ఖన్నా ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది. చిత్రంలో రాశీ నటన ప్రేక్షకులకి ఎంతగానో నచ్చడంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇటీవల రాశీ నటించిన ప్రతి రోజు పండగే చిత్రంలో ఏంజెల్ అర్నా పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది. ఆ పాత్రలో రాశీ ఖన్నా జీవించేసిందని అభిమానులు చెప్పుకొచ్చారు. గత కొద్దిరోజులుగా ఫొటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేసిన రాశీ ఖన్నా సోమవారం రోజు తన 30వ బర్త్‌డే జరుపుకుంది.
బర్త్‌డే సందర్భంగా మొక్కలు కూడా నాటిన ఈ అమ్మడు చాలా మందికి ఆదర్శంగా నిలిచింది. ఇక మొక్కలు నాటిన తర్వాత అభిమానులతో కాసేపు ముచ్చటించిన రాశీ ఖన్నా తన ప్రేమ ఫెయిల్యూర్ గురించి మాట్లాడింది. లవ్ అనేది సక్సెస్ కావడం చాలా అరుదుగా జరుగుతుంది. లవ్‌లో ఫెయిల్యూర్సే ఎక్కువ ఉంటాయి. నాకు అలాంటి అనుభవం గతంలో ఉందంటూ రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది. స్కూల్ డేస్ సమయంలో సీనియర్‌తో ప్రేమలో పడ్డ ఈ అమ్మడు అనివార్య కారణాల వలన అతనికి దూరం కావలసి వచ్చిందట.
ప్రస్తుతానికి సింగిల్‌గానే ఉన్నానని చెబుతున్న రాశీ ఖన్నా మనసులో మాటలని బయటపెట్టింది. ఎవరితోనైన డేటింగ్ చేయాలని ఉందంటూ చెప్పుకొచ్చింది. ఆ అనుభవం కూడా ఓ సారి ఆస్వాదించాలి అని అనుకుంటున్నా. కాని అటువైపు అడుగులు వేయాలంటే కాస్త భయంగా ఉందంటూ రాశీ ఖన్నా స్పష్టం చేసింది. ఈ అమ్మడి వాలకం చూస్తుంటే రానున్న రోజులలో ఎవరితోనైన ప్రేమలో పడుతుందా ఏంటి అని నెటిజన్స్ అంటున్నారు. రాశీ ఖన్నా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగు సినిమా ఆఫర్స్ ఏవి లేకపోయిన తమిళ సినిమాలతో బిజీగా ఉంది.