రష్మిక పెళ్లి అతనితోన.. నోరు జారిన స్టార్ ప్రొడ్యూసర్!

ఓటీటీ ప్లాట్ఫారం ఆహా లో అన్ స్టాపబుల్ షో కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్క మూవీ టీం వచ్చి సందడి చేస్తూ ఉంటుంది. అలాగే ఈ ఎపిసోడ్ కి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ మూవీ టీం వచ్చి సందడి చేసింది. అయితే బాలకృష్ణకి రష్మిక అంటే క్రష్ అనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకే మాటల్లో రష్మిక పెళ్లి సంగతి చెప్పమని నిర్మాత నాగవంశీని అడిగాడు.

అందుకు నాగవంశీ మాట్లాడుతు తెలుగు హీరోతోనే పెళ్లి అంటున్నారు. కానీ ఆ హీరో ఎవరనేది చెప్పడం లేదని బదులిచ్చాడు.బాలయ్య అంతటితో ఆగకుండా ఆమె నీకు చెప్పడం లేదా కాస్త లీక్ చేయొచ్చు కదా అనగానే,ఆమె ఏం చెప్పలేదు.నాకు మాత్రం హీరో నుంచి హింట్స్ వస్తున్నాయని వంశీ చెప్పడం జరిగింది. ఆ వెంటనే వంశీ పక్కనే ఉన్న థమన్ అంటే నీకు ఆ హీరో ఎవరో తెలుసని నాగ వంశీని ఇరికించేసాడు.

ఇక నాగవంశీ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ అప్ కమింగ్ మూవీని నాగవంశీ నే అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. వీడీ 12 గా తెరకెక్కుతున్న ఈ మూవీకి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకుడు.ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకుంతుంది.ఈ కారణంతోనే రష్మిక ప్రస్తావనని నాగవంశీ దగ్గర బాలకృష్ణ తీసుకొచ్చినట్టుగా నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఇక రష్మిక విషయానికి వస్తే టాలీవుడ్ లో అగ్రనటిగా కొనసాగుతున్న రష్మిక మందన్న ఇప్పుడు నేషనల్ క్రష్ గా ఎదిగింది.

‘పుష్ప 2’తో ఆమె కెరీర్ తార స్థాయికి చేరకుంది. మరోవైపు హీరో విజయ్ దేవరకొండతో రష్మిక రిలేషన్ లో ఉందనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనేది ఫిలిం నగర్ టాక్. అయితే ఈ విషయంపై అటు రష్మిక గాని ఇటు విజయ్ దేవరకొండ కానీ తమ బంధం గురించి బయటపడకపోవడం గమనార్హం.