కచ్చితంగా రోజూ అది చేయాల్సిందేనట.. రష్మికను చేసుకోబోయేవాడు లక్కీ ఫెలో!

ఛలో బ్యూటీ రష్మిక మందాన్న సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా వరుసగా వీడియోలు షేర్ చేస్తూ నానా హంగామా చేస్తోంది. బీచ్‌లో మొదటిసారి వర్కౌట్లు చేస్తున్నాను అంటూ ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. అలా రోజూ ఏదో ఒక వర్కౌట్ల వీడియోను షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తూనే ఉంది. తాజాగా మరో వీడియోను షేర్ చేసిన రష్మిక ఈసారి తనలోని ప్రతిభను అందరికీ పరిచయం చేసింది.

Rashmika Mandanna Omelette Preparing Video Goes Viral
Rashmika Mandanna Omelette Preparing Video Goes Viral

ఓ సారి తాను ఆమ్లేట్ గురించి ఓ పోస్ట్ చేశానని అప్పటి నుంచి తన ఫ్రెండ్స్ అందరూ దాని గురించి చెప్పమని అడుగుతున్నారని తెలిపింది. అందుకే ఆమ్లేట్ ఎలా ప్రిపేర్ చేస్తానో చూపెడుతూ ఈ వీడియోను షేర్ చేస్తున్నాను అని పేర్కొంది. అయితే రష్మిక వేసిన ఆమ్లేట్ మాత్రం సాధారణ ఆమ్లేట్‌లా కనిపించడం లేదు. అలా చూస్తూనే నోట్లో వేసేసుకోవాలనేంతగా నోరూరుతోంది. అయితే ఇక్కడే రష్మిక ఓ సీక్రెట్‌ను రివీల్ చేసింది.

తాను కచ్చితంగా ప్రతీ రోజూ ఆమ్లేట్ వేసుకుంటుందట. ప్రతీరోజూ అది చేయాల్సిందే తినాల్సిందే అంటూ చెప్పుకొచ్చింది. మై ఎవ్రీడే ఆమ్లేట్ అని చెబుతూ.. మీరు కూడా ట్రై చేయండి.. ఇలా వండండి.. ఎలా ఉందో నచ్చిందో లేదో మాకు చెప్పండి అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. ఇలా అయితే రష్మికను పెళ్లి చేసుకున్నవారు లక్కీ ఫెల్లోనే. ఎంతో రుచికరమైన ఆమ్లేట్‌ను రోజూ తినే అవకాశం వస్తుంది.