ఒక్క అబ్బాయితో ముగ్గురు అమ్మాయిలు.. అర్ధరాత్రి రష్మిక రచ్చ

ఛలో బ్యూటీ రష్మీక మందాన్న సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్, చేసే చేష్టలు, ఫోటో షూట్లు నవ్వు తెప్పించక మానవు. ఓ బుజ్జికుక్క పిల్ల మాదిరిగా పెట్టే ఆ పోజులు తెగ ట్రోలింగ్‌కు గురవుతుంటాయి. రష్మికకు, పెట్స్‌కు చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ విషయాన్ని హీరో నితిన్ భీష్మ మూవీ ప్రమోషన్స్‌లో లీక్ చేశాడు. కుక్క బిస్కెట్లు తింటుందని రష్మికపై నితిన్ సెటైర్ వేశాడు.

Rashmika Mandanna Enjoys WIth Her Friends And Pet
Rashmika Mandanna Enjoys WIth Her Friends And Pet

ఏదో టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో అని కొంచెం తిన్నాను.. కర్మ కాలి అది నితిన్ కంట్లో పడింది అంటూ అసలు విషయాన్ని రష్మిక చెప్పేసింది. అయినా సరే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. రావాల్సిన మీమ్స్, కావాల్సిన ట్రోలింగ్ అంతా జరిగిపోయింది. ఇక వాటికి ఊతమిచ్చేలా రష్మిక కూడా డిఫరెంట్‌గా కుక్క పిల్లలా పోజులిస్తూ ఫోటో షూట్లు చేసేది. దీంతో జనాలు ఇంకా ఫిక్స్ అయిపోయారు. అయితే రష్మిక కూడా ఓ పెట్ లవర్ అన్న సంగతి తెలిసిందే.

Rashmika Mandanna Enjoys WIth Her Friends And Pet
Rashmika Mandanna Enjoys WIth Her Friends And Pet

ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా బిజీ అయిపోతోంది రష్మిక. వర్కౌట్లు చేసేటప్పుడు ఓ పోస్ట్ అయిన తరువాత మరో పోస్ట్.. ఇలా చేస్తూనే పోతోంది. రీసెంట్‌గా విజయ్ దేవరకొండ తల్లి మాధవి దేవరకొండ బర్త్ డేకు రష్మిక చెప్పిన విషెస్ తెగ వైరల్ అయ్యాయి. ఇక తాజాగా రష్మిక అర్దరాత్రి చేసే రచ్చ గురించి ఓ పోస్ట్ చేసింది. ఒక్క బాయ్, ముగ్గురు క్రేజీ గర్ల్స్ అంటూ రోడ్డు మీద రచ్చ చేస్తోన్నో ఫోటోను రష్మిక స్నేహితురాలు షేర్ చేసింది. ఇక ఆ పోస్ట్‌కు లవ్ సింబల్‌ను యాడ్ చేసింది రష్మిక. అయితే ఇందులో బాయ్ అంటే మనిషి మాత్రం కాదండోయ్.. అది ఓ కుక్క పిల్ల. అలా ఆ పెట్‌తో అర్దరాత్రి రష్మిక బాగానే రచ్చ చేసింది.