“పుష్ప 2” పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన రష్మికా..!

రానున్న రోజుల్లో ఇండియన్ సినిమా దగ్గర నెక్స్ట్ బిగ్ థింగ్ గా మారనున్న భారీ చిత్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం “పుష్ప 2 ది రూల్” కూడా ఒకటి. ఒక బాహుబలి ఒక కేజీఎఫ్ చిత్రాల సీక్వెల్స్ అనంతరం మళ్ళీ ఓ సీక్వెల్ కి అంత డిమాండ్ ఉంది అంటే అది ఖచ్చితంగా పుష్ప 2 అని చెప్పాలి.

మరి ఆ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా లేటెస్ట్ గా నటించిన చిత్రం “ఆనిమల్” తో తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ ని ఆమె తన ఖాతాలో వేసుకోగా ఈ సినిమా ప్రమోషన్స్ లో అయితే పుష్ప 2 పై క్రేజీ అప్డేట్ అందించింది. పుష్ప 2 కోసం మాట్లాడుతూ..

ఈ సినిమా అనుకున్న దానికన్నా చాలా గ్రాండ్ గా ఉంటుంది అని అలాగే మెయిన్ గా సినిమాలో సెకండాఫ్ ఐతే అందరికీ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది అని ఆమె చెప్పింది. దీని బట్టి పుష్ప 2 సెండాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని చెప్పాలి. మరి ఆమె చెప్పినట్టుగానే సుకుమార్ దీనిని చెక్కాడా లేదా అనేది చూడాలి.

ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు. అలాగే ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లోనే కాకుండా వరల్డ్ వైడ్ గా ఎన్ని వీలయితే అన్ని భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు అలాగే ఈ ఆగస్ట్ 15న రిలీజ్ కాబోతుంది.