టాలీవుడ్‌లో ప్రస్తుతం హీరోయిన్లందరూ ఒకే బాట పడుతున్నారు. లాక్ డౌన్ వల్ల ఇంట్లోనే కూర్చుని తినడం వల్ల ఒళ్లు వచ్చిందని భావిస్తున్నారో ఏమో గానీ అందరూ జిమ్ బాట పట్టారు. వర్కౌట్లు చేయడంలొ తలమునకలయ్యారు. లావణ్య త్రిపాఠి, నిహారిక, రష్మిక మందాన్న, రాశీ ఖన్నా వంటి వారు జిమ్‌లో తెగ కష్టపడుతున్నారు. అందులోనూ ఒంటరిగా కాదు. జంటలుగా విడిపోయి మరీ వర్కౌట్లు చేస్తున్నారు.
ఒంటరిగా జిమ్‌కు వెళ్లడం బోర్‌గా ఫీలయ్యారో ఏమో గానీ లావణ్య త్రిపాఠి-నిహారికలు జిమ్ మేట్స్‌గా తయారయ్యారు. ఒకే సమయానికి వస్తున్నారు.. కలిసి చేస్తున్నారు. వెళ్లిపోతునారు. ఇలా వారిద్దరి మధ్య స్నేహబంధం ఇంకా బలంగా తయారైనట్టు కనిపిస్తోంది. ఇక తాజాగా రష్మిక మందాన్న రాశీ ఖన్నా కూడా జిమ్‌లో సందడి చేసినట్టు కనిపిస్తోంది. ఈ ఇద్దరూ కలిసి జిమ్‌లో ఎలా అల్లరి చేస్తున్నారో తెలిపేట్టుగా ఓ ఫోటోను షేర్ చేశారు.
అసలే రష్మిక ఈ మధ్య తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ కష్టపడ్డట్టు కష్టపడుతోంది. బీచ్‌లో పరిగెడుతూ.. ఇసుకలో వర్కౌట్లు చేస్తోంది. ఓలింపిక్స్ గేమ్స్‌లో పార్టిసిపేట్ చేసే లెవెల్‌లో ప్రాక్టీస్ చేస్తోంది. తాజాగా రాశీ ఖన్నాతో కలిసి మళ్లీ జిమ్‌లో దర్శనమిచ్చింది. మొత్తానికి ఈ ఇద్దరు కలిసి బాగానే కష్టపడుతున్నారు. జిమ్ సెంటర్‌లో తెగ కష్టపడి జీరో సైజ్ లోకి మారాలని ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది.