Rashmika: బన్నీ ఒక్కడే తప్పు చేశాడా… రష్మిక కూడా పక్కనే ఉంది కదా…. ఆమెనూ లోపలేయండి?

Rashmika: అల్లు అర్జున్ వ్యవహారం ఇప్పుడే ముగిసేలా కనిపించడం లేదు ఈ విషయం గురించి రాజకీయ నాయకులందరూ మౌనం పాటిస్తున్నప్పటికీ సినిమా సెలబ్రిటీలందరూ కూడా మరోసారి చర్చిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది సీనియర్ సెలబ్రిటీలు ఈ విషయం గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ అలా వ్యవహరించకుండా ఉండాల్సిందని ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండాల్సింది అంటూ కొంతమంది అల్లు అర్జున్ తప్పు పడుతూ కామెంట్లు చేస్తున్నారు.

ఇలా అల్లు అర్జున్ కు ఏమాత్రం సంబంధం లేనటువంటి విషయంలో ఆయనని నిందితుడిగా చేర్చితనని అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేయటాన్ని అల్లు అర్జున్ అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే పలు మీడియా ఛానల్స్ ప్రజల అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ విషయంలో కేవలం ప్రభుత్వం అల్లు అర్జున్ టార్గెట్ చేస్తున్నట్టే ఉందని అల్లు అర్జున్ తప్పులేదని తెలిపారు.

ఇలాంటి ఘటన చోటు చేసుకోవడానికి థియేటర్ యాజమాన్యం పోలీసు బందోబస్తు ఫెయిల్యూర్ కారణమని అలాగని ఒక హీరోని అరెస్టు చేసి ఇన్ని ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదు అంటూ చెబుతున్నారు. ఇకపోతే మరి కొంతమంది థియేటర్ కు ఆరోజు అల్లు అర్జున్ మాత్రమే రాలేదు రష్మిక కూడా వచ్చింది. రష్మిక కూడా అల్లు అర్జున్ పక్కనే ఉన్నారు. మరి ఆమెపై ఎవరు కేసు పెట్టలేదు ఎందుకు తనని ఎందుకు అరెస్టు చేయలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు.

చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ ప్రభుత్వాలు చెబుతున్నాయి అలాగే చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటే రష్మికపై కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు.. ఆమెను కూడా అరెస్టు చేసి లోపల వేయాలి కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రజాభిప్రాయం చూస్తుంటే ఈ వివాదం కాస్త రష్మిక మెడకు కూడా చుట్టుకొనే లాగా ఉందని స్పష్టమవుతుంది.