Sudigali Sudheer: సుడిగాలి సుదీర్ చేష్టలకు బాధ పడిన రష్మి… ఏం జరిగిందంటే?

Sudigali Sudheer: బుల్లితెర మీద ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో, ఢీ డాన్స్ షో లకి మంచి ప్రేక్షకాదరణ ఉంది. ఈ కార్యక్రమాల ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా డాన్సర్లుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈ షోలలో న్యాయనిర్ణేతలుగా వ్యవహరించే వారు కూడా తమదైన రీతిలో మంచి గుర్తింపును పొందారు. ఇకపోతే సుధీర్, రష్మీ జోడి చాలా ఫేమస్ అయ్యింది. వీరిద్దరూ ఏ షో లో ఉంటే ఆ షో సూపర్ హిట్ అయినట్లే.

ఢీ డాన్స్ షో లో జడ్జిగా వస్తున్న హీరోయిన్ పూర్ణ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల ఆమె బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో కీలక పాత్ర పోషించింది. గత కొంతకాలంగా పూర్ణ ఢీ డాన్స్ ప్రోగ్రాంకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ షో లో పూర్ణ చేసే పనులు అందరికీ చిరాకు తెప్పించేలా ఉంటాయి. ప్రస్తుతం ఈవిడ జబర్దస్త్ కామెడీ షోలో కూడా కనిపించనుంది.అయితే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఒకటి ఇటీవల విడుదల అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఢీ షో లో పూర్ణ ఎప్పుడు కంటెస్టెంట్లు, డ్యాన్స్ మాస్టర్లకు ముద్దులు పెడుతూ బుగ్గలు కొరుకుతూ ఉంటుంది. ఆమె చేసే పనులకి మల్లెమాల వారు తప్ప ఇంకెవరూ ఆమెని జడ్జ్ గా అనుకోరు. అలాంటి పూర్ణ ప్రస్తుతం జబర్దస్త్ లో ఇలాంటి పనులు చేయటం మొదలు పెట్టింది. జబర్దస్త్ లో పూర్ణ ఫైమాకు ముద్దు పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇమాన్యుయేల్ కూడా ముద్దు కావాలని కోరాడు. మీకు ముద్దు కావాలా? అయితే ఇలా రండి అని పిలిచి ఇమాన్యుయేల్ చేతి మీద ముద్దు పెడుతుంది. బుగ్గ మీద ముద్దు పెడుతుందని ఆశపడిన ఇమాన్యుయేల్ కి నిరాశ ఎదురయింది.

ఆ సమయంలో సుదీర్ కూడా ముద్దు కావాలి అని అడగగా.. మీరు నా బుగ్గ కొరుకుతారా ?అని అడుగుతుంది. సుధీర్ పూర్ణ బుగ్గ కొరికెందుకు వెళ్ళటంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ సమయంలో రష్మి కల్పించుకుని ఇలాంటి వాటిని నేను ఒప్పుకోను అని అంటుంది. రష్మీ అలా అన్నా కూడా సుధీర్ పూర్ణ దగ్గరకు వెళతాడు. దీంతో రోజా కళ్ళు మూసుకోగా.. ముద్దు కోసం పూర్ణ తన బుగ్గను రెడీగా పెట్టింది. అసలు అక్కడ ఏం జరిగిందో పూర్తిగా తెలియాలంటే వచ్చే వారం వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.