హార్ట్ బీట్ పెంచేస్తోన్న రాశీ ఖన్నా.. బికినీలో ఈత కొడుతూ రచ్చ

Rashi khanna Bikini in goa

రాశీ ఖన్నా తెరపై ఎంత అందంగా ముద్దుగా పద్దతిగా కనిపిస్తుందో అందరికీ తెలిసిందే. ఊహలు గుసగుసలాడే సినిమా సమయంలో రాశీ ఖన్నా ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలిసిందే.వచ్చిన కొత్తలో కాస్త బొద్దుగా ఉన్నా కూడా ఇప్పుడు జీరో సైజ్‌లోకి మారిపోయింది. పైగా ఆమె వేసే పాత్రల్లోనూ కొన్నిమార్పులు కనిపిస్తున్నాయి. మొదట్లో అంతగా రొమాంటిక్ సీన్స్‌లో నటించేది కాదు.

Rashi khanna Bikini in goa
Rashi khanna Bikini in goa

కానీ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో రాశీ ఖన్నా రెచ్చిపోయి మరీ నటించింది. అయితే అలా విచ్చలవిడిగా అందాలను ఆరబోయడం, అడల్ట్ కంటెంట్ సినిమాలో నటించడంతో రాశీ ఖన్నా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. అయితే ఇకపై అలాంటి పాత్రలేవీ చేయనని, కథ చెప్పినప్పుడు ఒకలా ఉంటాయని, తెరపై చూస్తే మరోలా ఉంటాయని ఆ మధ్య రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది. అయితే రాశీ ఖన్నా మాత్రం గ్లామర్ రోల్స్ చేయాలని బాగానే ఆసక్తి చూపుతోన్నట్టు కనిపిస్తోంది.

అందుకే ఈ మధ్య రాశీ ఖన్నా వరుసగా ఫోటో షూట్లతో రచ్చ చేస్తోంది. లంగావోణి, చీరకట్టు, మోడ్రన్ డ్రెస్ ఇలా అన్ని రకాలుగా ఫోటో షూట్లు చేస్తోంది. అయితే రాశీ ఖన్నా గత కొన్ని రోజులుగా గోవాలో ఉందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాశీ ఖన్నా స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొడుతూ చిల్ అవుతోంది. ఈ మేరకు బికినీలో కనిపించి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఇలా రాశీ ఖన్నా తడి అందాలు చూడటంతో నెటిజన్ల గుండే ఆగిపోయినంత పని అయిపోయిందట.