న్యూడ్ ఫోటోషూట్ కోసం రణవీర్ తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ !

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన రణవీర్ సింగ్ హీరోగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కొంతకాలానికి స్టార్ హీరోగా తనకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకున్నారు. రణవీర్ సింగ్ నటించిన సినిమాలు అన్ని దాదాపుగా హిట్ అయ్యాయి. టాలెంటెడ్ యంగ్ హీరోగా గుర్తింపు పొందిన రణవీర్ సింగ్ కి యువతలో కూడా మంచి క్రేజ్ ఉంది.రణవీర్ సింగ్ నటించిన సినిమాలు అన్ని మినిమం వసూళ్లను అందుకుంటూ నిర్మాతల్లో ఒక నమ్మకం కూడా ఏర్పరచుకున్నాడు. ఈ యంగ్ అప్పుడప్పుడు భిన్నమైన డ్రెస్సింగ్ స్టైల్ తో ఫోటోషూట్ చేయించుకుంటూ ఉంటారు.

అంతేకాకుండా రణబీర్ సింగ్ కొన్ని సందర్భాలలో బోల్డ్ కామెంట్స్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. దీపికా పదుకొనే ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా రణవీర్ పద్ధతిలో ఏ మాత్రం మార్పు లేదు. పెళ్లికి ముందు ఎలా జీవితాన్ని ఎంజాయ్ చేశాడో పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ కలిసి జీవితాన్ని చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల రణవీర్ సింగ్ చేసిన ఒక ఫోటోషూట్ వల్ల ప్రస్తుతం ఇతను విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఇటీవల రణవీర్ సింగ్ న్యూడ్ గా ఫోటోషూట్ కి ఫోజులిచ్చాడు. ఒంటిమీద నూలు పోగు కూడా లేకుండా ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. దీంతో పలువురు సినీ ప్రముఖులు కూడా రణవీర్ ని విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఈ టాపిక్ బీ-టౌన్ లో చర్చంశనీయంగా మారింది.

బాలీవుడ్ లో నే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా ఈ వార్త వైరల్ గా మారింది. అయితే రణవీర్ ఇలా న్యూడ్ ఫోటో షూట్ వెనుక ఒక బలమైన కారణం ఉండే ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ఫోటోషూట్ కోసం రణవీర్ పేమెంట్ కూడా ఇప్పుడు బీ- టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా రణవీర్ ఒక సినిమా కోసం 45 నుండి 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటాడు. అయితే ఈ న్యూడ్ ఫోటో షూట్ కోసం కూడా రణవీర్ ఒక సినిమా కి తీసుకునే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్తలు బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి.