వారణాసిలో రణ్‌వీర్‌ – కృతి సనన్‌!

విలక్షణ నటనతో ఎంటర్‌టైన్‌ చేసే అతికొద్ది మంది బాలీవుడ్‌ నటుల్లో ఒకరు రణ్‌వీర్‌ సింగ్‌. అందం, అభినయం, స్టన్నింగ్‌ యాక్టింగ్‌తో ఇంప్రెస్‌ చేసే టాలెంట్‌ ఉన్న బ్యూటీ కృతిసనన్‌. ఈ భామ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు.

ఈ ఇద్దరు ఒక్కచోట సందడి చేస్తే ఎలా ఉంటుంది. రణ్‌వీర్‌, కృతిసనన్‌ పాపులర్‌ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్రా ఫ్యాషన్‌ షోలో థీమ్‌ను ప్రతిబింబించే కాస్ట్యూమ్స్‌లో ర్యాంప్‌ వాక్‌ చేసి ఔరా అనిపించారు. అనంతరం రణ్‌వీర్‌ సింగ్‌, కృతిసనన్‌ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం వారణాసిలోని కాశీ విశ్వనాథ్‌ ఆలయాన్ని సందర్శించారు. రణ్‌వీర్‌సింగ్‌, కృతిసనన్‌ వారణాసి సందర్శనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.