Ranbir-Alia: సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. బాలీవుడ్‌లో ఎప్పుడూ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచే రణబీర్ కపూర్, అలియా భట్‌లు త్వరలో పెళ్లి చేసుకోబుతున్నారనే ప్రచారం ఎప్పుటినుంచో జరుగుతూనే ఉంది. కరోనా వల్ల పెళ్లి వాయిదా వేసుకుంటూ వచ్చిన ఈ లవ్ బర్డ్స్ త్వరలోనే వివాహానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పెళ్లి షాపింగ్ కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. అయితే సడన్‌గా రణ్‌బీర్, ఆలియా పెళ్లి చేసుకున్నారంటూ ఇప్పటికే ఓ వార్త నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఏప్రిల్ రెండో వారంలో వీళ్లిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారంటూ తెలియడంతో ఇండస్ట్రీలో సందడి నెలకొంది.
ఇటీవలే రణభీర్ తల్లి నీతూ కపూర్, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా స్టోర్‌లో కనిపించడంతో అప్పటికే ఫ్యాన్స్ వీళ్లిద్దరి పెళ్లి కోసమే ఈ షాపింగ్ అంటూ ఆ ఫొటోలను తెగ వైరల్ చేశారు. ఇక ఇప్పుడు వాళ్లు అనుకున్నదే నిజం అయినట్టు తెలుస్తోంది. దీంతో పెళ్లికి సంబంధించిన పనులు మొదలయ్యాయని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇక ఎప్పటినుంచో ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న తమ అభిమాన హీరో, హీరోయిన్ ఒక్కటవుతున్నారని తెలిసి వారి అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు.
ఇకపోతే వీరి వివాహ వేదిక ముంబైలోని చెంబూరులోని ఆర్కే ఇంట్లో ఉండవచ్చని సమాచారం. అంతకుముందు రణబీర్ కపూర్, అలియా భట్ రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వెలువడినా, ముంబైలోనే పెళ్లి ఘనంగా జరిపించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా అలియా భట్ నటించిన RRR ఇటీవలే విడుదలై భారీ సక్సెస్‌ను నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. ఇదిలా ఉండగా అలియా, తన ప్రియుడు రణబీర్ కపూర్‌తో కలిసి బ్రహ్మాస్త్రలో కనిపించనుండగా, ఈ చిత్రం సెప్టెంబర్ 9, 2022న విడుదల కానుంది.