అల్లు అర్జున్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రణబీర్ కపూర్.. ఆ సినిమాలో అలా చేయడంతో?

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా గుర్తింపు పొందిన రణబీర్ కపూర్ ఇటీవల ఆలియా భట్ ని వివాహం చేసుకొని ఒక ఇంటివాడయ్యాడు. అంతేకాకుండా పెళ్లి జరిగిన కొంతకాలానికే ఈ దంపతులు ఇద్దరు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందనున్నారు. ఇటీవల ఆలియా తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇదిలా ఉండగా రణబీర్ కపూర్ ప్రస్తుతం షంషేరా సినిమా ప్రమోషన్ పనులలో బిజీగా ఉన్నాడు.

ఈనెల 22వ తేదీన షంషేరా సినిమా విడుదల కానుండడటంతో సినిమా ప్రమోషన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం రణబీర్ కపూర్ ఈ సినిమా ప్రమోషన్ పనులలో చాలా బిజీగా ఉన్నాడు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రణబీర్ తరచూ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ అనేక ఆసక్తికర విషయాల గురించి వెల్లడించాడు. ఈ క్రమంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రణబీర్ కపూర్ ని ఇటీవల మీరు చేయాలనుకున్న పాత్ర ఏమిటి?” అని విలేకరి అడగ్గా.. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని పుష్పరాజ్ పాత్ర చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన తనకు చాలా నచ్చిందని, ఈ సినిమా సీక్వెల్‌ కోసం ఆసక్తిగా ఉన్నానని రణబీర్ చెప్పాడు.ఇక తన పెట్ డాగ్‏తో కలిసి తగ్గేదే లే సిగ్నేచర్ స్టెప్ వేసి అలరించాడు.

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన సినిమా పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. దేశవ్యాప్తంగా అన్ని భాషలలో విడుదలైన ఈ సినిమా నార్త్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ తన నటనతో సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో నటించినున్నాడు. ఆగస్టు రెండవ వారంలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానున్నట్లు సమాచారం.