బాహుబలి సిరీస్ తో ప్రభాస్ కు ఎంత పేరు వచ్చిందో.. ఆ సినిమాలో భళ్లాలదేవగా నటించిన రానా దగ్గుబాటికి కూడా అంతే పేరు వచ్చింది. సినిమాకు ప్రభాస్ ఎంత బలమయ్యారో.. రానా కూడా అంతే బలమయ్యారు. ఇద్దరు యోధుల్లా ఉన్నారు కాబట్టే సినిమాకు కరెక్ట్ గా సూట్ అయ్యారు.
అయితే.. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ మాత్రం తన సినిమాలను పెంచుకుంటూ పోతుంటే రానా మాత్రం ఆచితూచి అడుగేస్తున్నారు. ఇటవలే పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే.. ప్రభాస్ లాగానే రానా కూడా తన పెళ్లిని కొన్ని ఏళ్ల వరకు పోస్ట్ పోన్ చేస్తారని అంతా అనుకున్నారు కానీ ఎవ్వరూ ఊహించని విధంగా రానా పెళ్లి చేసేసుకున్నారు.
అయితే… రానా పెళ్లి చేసుకున్న మిహీక బజాజ్ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అని అందరూ చెక్ చేయడం మొదలు పెట్టారు.
రానా.. మిహీకాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే విషయం తెలుసు కానీ.. అసలు.. రానాకు మిహీకాతో పరిచయం ఎలా ఏర్పడింది? అనే విషయం మాత్రం ఇటీవలే తెలిసింది. ఓ ఇంటర్వ్యూలో రానా తన స్కూల్ డేస్ లవ్ స్టోరీ మొత్తం చెప్పేశారు.
విక్టరీ వెంకటేశ్ కూతురు ఆశ్రితతో కలిసి మిహీక రోజూ స్కూల్ కు వెళ్లేదట. అప్పటి నుంచి రానాకు మిహీక తెలుసట. కొన్ని రోజులకు మిహీక ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి ముంబైకి షిఫ్ట్ అయ్యారట. కానీ.. రానా మాత్రం మిహీకతో తన ఫ్రెండ్ షిప్ ను కొనసాగించారట. తర్వాత తన ఫ్యామిలీని కలిసి.. మిహీకాకు ప్రపోజ్ చేశారట. రానా తన చిన్ననాటి ఫ్రెండ్ కావడంతో.. మిహీక కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వాళ్ల పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి కూడా ఎటువంటి అభ్యంతరాలు రాలేదంటూ తన స్కూల్ డేస్ లవ్ స్టోరీని చెప్పుకొచ్చారు రానా.