బిగ్ బాస్ హోస్ట్ గా మారనున్న శివగామి..దీనిలో నిజమెంత?

బుల్లితెరపై ప్రసారమౌతున్న బిగ్ బాస్ రియాలిటీ షోకి ఎంతో ప్రాధాన్యత ఉన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం వివిధ భాషలలో సీజన్లను పూర్తిచేసుకుని
ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఈ క్రమంలోనే తెలుగులో ఈ కార్యక్రమం ఐదవ సీజన్ ప్రసారం కాగా ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమం తమిళంలో కూడా ఐదవ సీజన్ ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి లెజెండరీ నటుడు కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఒక సినిమా షూటింగ్ నిమిత్తం అమెరికా వెళ్లి వచ్చిన కమల్ హాసన్ కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం కమల్ హాసన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే కమల్ హాసన్ కరోనా బారిన పడటంతో ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించే బాధ్యతలను తన కూతురు శృతిహాసన్ తీసుకుంటుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ కార్యక్రమానికి హోస్ట్ గా లెజెండరీ యాక్ట్రెస్ రమ్యకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

గతంలో తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున తన పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకోవడానికి కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లిన సమయంలో రమ్యకృష్ణ బిగ్ బాస్ సీజన్ ఫోర్ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించారు. ఈ క్రమంలోనే రమ్యకృష్ణకు హోస్ట్ గా వ్యవహరించిన అనుభవం ఉండటం చేత ఈమెను తమిళ బిగ్ బాస్ సీసన్ ఫైవ్ కి ఈ వారం హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్లు పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి.