గాసిప్స్ : బాబాయ్ డేట్ పై కన్నేసిన రామ్ చరణ్??

టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న బిగ్గెస్ట్ ఫ్యామిలీ లలో మెగా ఫ్యామిలీ కూడా ఒకటి అలాగే ఈ ఫ్యామిలీ నుంచి ఉన్న బిగ్ స్టార్స్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకి వచ్చే వసూళ్లు ఓపెనింగ్స్ కోసం కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

కాగా ఇప్పుడు ఈ ఇద్దరు కూడా తమ కెరీర్ లో మోస్ట్ అవైటెడ్ చిత్రాలు గేమ్ చేంజర్ అలాగే ఓజి సినిమాలు చేస్తున్నారు. ఈ చిత్రాల్లో పవన్ నటిస్తున్న ఓజి చిత్రాన్ని మేకర్స్ ఈ ఏడాది సెప్టెంబర్ 27 రిలీజ్ అంటూ ఒక డేట్ వదిలి సెన్సేషన్ సెట్ చేశారు. దీనితో ఈ భారీ చిత్రం విడుదల ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యిపోయింది.

కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఈ చిత్రంపై పోటీగా రామ్ చరణ్ వస్తాడు అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం గేమ్ చేంజర్ ని కూడా మేకర్స్ సెప్టెంబర్ 27నే అనుకుంటున్నారు అని కానీ పవన్ ఓజి ని ముందు అనౌన్స్ చేశారు అంటూ గాసిప్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి.

అయితే దాదాపు ఇద్దరి సినిమాల్లో ఖచ్చితంగా ఒకటే సినిమా ఆరోజు వస్తుంది. మరి అది బాబాయ్ సినిమానా లేక అబ్బాయ్ సినిమానా అనేది మాత్రం కొన్నాళ్ళు ఆగి చూడాలి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఈ రెండు సినిమాలు కూడా థమన్ మ్యూజికల్ లో తెరకెక్కుతున్నాయి అలాగే తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మాత్రమే రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.