Ram Charan : ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ లా మధ్య ఉన్న స్నేహ బంధం మరింత దృఢమైంది. వాళ్లిదరు చేస్ల ఏళ్లుగా మంచి స్నేహితులే అయినా ఆ విషయం బయటకు తెలియదు కాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో ఈ విషయం బయటకు వచ్చింది. అంతే కాకా మరింత బలపడింది వీరి స్నేహం. అవకాశం వచ్చినపుడల్లా ఒకరిని ఒకరు ప్రశంసించుకోవడం చూస్తూనే ఉన్నాం. నిజంగా వీళ్ల మధ్య ఉన్న బంధానికి వాళ్ళ అభిమానులే కాదు అందరు ఫిదా అయ్యారు.
ఇక ఆర్ఆర్ఆర్ పూర్తయ్యాక రామ్ చరణ్ అయ్యప్ప మాల ధరించారు. ప్రతి సారి రామ్ చరణ్ అయ్యప్ప మాల ధరిస్తారు ఇది అందరికి తెలిసినదే. అయితే ఈ సారి ఎన్టీఆర్ కుడా హనుమాన్ దీక్ష తీసుకున్నారు. దీంతో అందరు రామ్ చరణ్ వల్ల ఎన్టీఆర్ కూడా మాల ధరించాడని, సహవాస దోషం అంటూ అందరు అనుకున్నారు. కానీ ఇటీవల రామ్ చరణ్ తన తండ్రితో కలిసి నటించిన ఆచార్య సినిమా ప్రచార కార్యక్రమల్లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు.ఇక ఈ ఇంటర్వ్యూల్లో ఆసక్తికర ప్రశ్నలు అడిగారు.
అలానే ఎన్టీఆర్ దీక్ష కు కారణం మీరేనా అని అడుగగా… కాదని క్లారిటీ ఇచ్చాడు రామ్ చరణ్. ఎన్టీఆర్ ఎప్పటినుండో దీక్ష తీసుకోవాలని అనుకుంటున్నాడని ఇప్పుడు కుదిరిందని ఇందులో తన ప్రమేయం ఏమి లేదని వివరించాడు. ఇక ఎన్టీఆర్ జాతకం రీత్యా ఈ మాల ధరిస్తే మంచిదని తల్లి, భార్య ప్రణతి చెప్పడంతో ఎన్టీఆర్ మాల ధరించారాని తెలుస్తోంది. ఇక దీనిపై ఫ్యాన్స్ తమదైన రీతిలో స్పందిస్తున్నారు. మాల్ వేసుకోవడం అనేది వారి వ్యక్తిగతం.. అది ఒకరు చెబితేనో .. ఒకరిని చూస్తేనే రాదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.