సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి విడిపోవడానికి ఎంతో సులభం.. ప్రేమించుకొని ఒకరినొకరి అర్థం చేసుకున్న తర్వాత పెళ్లిళ్లు చేసుకునే వీళ్లు చిన్నపాటి మనస్పర్ధలు వస్తేనే విడాకులకు సిద్ధమవుతున్నారు.ఇలా ఎన్నో సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో సంతోషంగా గడిపిన వాళ్ళు కూడా చివరికి విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో అగ్రతారక వెలిగిన నటి రంభ కెనడాకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఈ విధంగా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన రంభ వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని మనస్పర్ధలు కారణంగా ఈమె తన భర్తకు విడాకులు ఇవ్వాలని నిశ్చయించుకున్నారట.ఈ క్రమంలోనే విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో అప్లై చేయగా భరణం కింద తనకు నెలకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే వీరు విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారని తెలియగానే ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు రంగంలోకి దిగి రంభకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారని తెలుస్తోంది.
భార్య భర్తలైన తర్వాత చిన్నపాటి మనస్పర్ధలు రావడం సర్వసాధారణమే ఈ మాత్రం దానికి విడాకులు తీసుకుంటే పిల్లల భవిష్యత్తు ఇబ్బందులకు గురవుతుందని రాఘవేంద్రరావు తన భవిష్యత్తు గురించి వివరించడంతో ఈమె తీసుకునే నిర్ణయం సరైంది కాదని, మరోసారి విడాకుల గురించి పునరాలోచన చేసిన రంభ విడాకుల విషయంలో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.ఇలా రాఘవేంద్రరావు చొరవ తీసుకోవటం వల్లే ఈమె వైవాహిక జీవితం నిలబడిందని లేకపోతే ఇప్పటికే విడాకులైపోయేవని తెలుస్తోంది.