ఓటిటి : “రామబాణం, ఉగ్రం” డిజిటల్ పార్ట్నర్స్ డీటెయిల్స్.!

టాలీవుడ్ సినిమా దగ్గర ఈవారం థియేట్రికల్ గా రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో అల్లరి నరేష్ హీరోగా మిర్నా హీరోయిన్ గా దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఇంటెన్స్ యాక్షన్ చిత్రం “ఉగ్రం”. కాగా ఇదే దర్శకునితో నరేష్ ముందుగా నాంది అంటే స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమా చేసి వస్తుండడంతో దీనిపైనా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమాతో పాటుగా మ్యాచో హీరో గోపీచంద్ హీరోగా ఖిలాడీ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం అయ్యి గ్లామర్ తో మోత మోగించిన బ్యూటీ డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించిన మరో చిత్రం “రామబాణం” కూడా ఈరోజే రిలీజ్ అయ్యింది. కాగా ఈ చిత్రాన్ని గోపీచంద్ కెరీర్ లో సాలిడ్ హిట్స్ లక్ష్యం, లౌక్యం లాంటి హిట్స్ ఇచ్చిన దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కించగా..

ఈ రెండు సినిమాలు ఈరోజు వాటి అదృష్టాన్ని పరీక్షించుకోడానికి అయితే వచ్చాయి. కాగా ఈ సినిమాల టాక్ లు పక్కన పెడితే. మరి ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ అనంతరం ఏయే ఓటిటి ప్లాట్ ఫామ్ లో వస్తాయో తెలుస్తుంది. కాగా మొదటగా ఉగ్రం సినిమాని అని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్నారట.

అలాగే ఇక రామబాణం సినిమాని అయితే మొన్న ఏజెంట్ హక్కులు సొంతం చేసుకున్న సంస్థ సోనీ లివ్ వారు కొనుగోలు చేశారట. సో ఇక థియేట్రికల్ రన్ తర్వాత అయితే వీటిలో ఈ చిత్రాలని ఆడియెన్స్ చూసి ఎంజాయ్ చేయవచ్చు. బహుశా ఇవి 5 నుంచి 8 వారాల గ్యాప్ లో ఓటిటి లో అయితే సందడి చేయనున్నట్టుగా తెలుస్తున్నాయి.