Ram Pothineni: పోలీస్ అధికారిగా స్టైలిష్ లుక్ లో రామ్ పోతినేని..!

Ram Pothineni: పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా మంచి విజయాన్ని సాధించిన రామ్ పోతినేని, తర్వాత వచ్చిన రెడ్ సినిమాతో తన నటనకు మంచి మార్కులు వేయించుకున్నాడు.తన నటనతో డాన్స్ తో మంచి హీరోగా కొనసాగుతున్న రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. మాస్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా కి “ది వారియర్” అనే టైటిల్ ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే.పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమాలో రామ్ మొదటిసారిగా పోలీస్ అధికారిగా నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడు, రిలీజ్ డేట్ వెల్లడించిన సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లకు మంచి స్పందన వచ్చింది.పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. తాజాగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్రబృందం ఒక పోస్టర్ ని విడుదల చేసింది. ఉగాది రోజున విడుదల చేసిన పోలీసులు మాత్రం స్టైలిష్ లుక్ లో రామ్ అదరగొట్టారు.

రామ్ ఈ పోస్టర్ లో స్టైలిష్ లుక్ లో యూనిఫాం వేసుకొని బైక్ మీద వస్తూ కనిపించాడు. ఈ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతి పోస్ట్ ఆ సినిమా మీద అంచనాలు పెంచుతూ వస్తోంది. ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు. సరైనోడు సినిమా లో అల్లు అర్జున్ కి ప్రతినాయకుడు గా నటించిన ఆది పినిశెట్టి ఈ సినిమాలో రామ్ కు ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.