శ్రీలీలను గిల్లుతున్న ఆ యంగ్ హీరో ఎవరు.?

‘పెళ్లి సందడి’ భామ శ్రీలీల హవా నడుస్తోందిప్పుడు. వరుస అవకాశాలు దక్కించుకుంటోందీ భామ. లేటెస్టుగా ‘ధమాకా’తో హిట్టు కొట్టి, మరో మెట్టు పైకెక్కేసిందీ అమ్మడు. ఇప్పటికే ఐదారు ప్రాజెక్టులు చేతిలో వున్నాయ్.

బాలయ్య సినిమాలో కూతురు పాత్ర పోషిస్తోంది శ్రీలీల. అలాగే, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీంతో పాటూ రామ్ వంటి యంగ్ హీరోలతోనూ జత కడుతోంది. ఈ తరుణంలో ఓ యంగ్ హీరో, సీనియర్ హీరోల సరసన నటిస్తే తొందరగా ఫేడవుట్ అయిపోతావంటూ శ్రీలీలకు క్లాస్ తీసుకుంటున్నాడట.

అదీ నిజమే అయినా, అవకాశాలు రావడం ముఖ్యం కదా. సీనియర్ హీరోతో చేసిన ‘ధమాకా’ పెద్ద హిట్ అవ్వడంతో శ్రీలీల సీనియర్ హీరోల సరసన నటించడంలో తనకు ఎలాంటి అభ్యంతరాల్లేవంటోందట. పాప సెంటిమెంట్ బాగా ఫాలో చేస్తోందనుకుంటా.!