సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం టాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పవచ్చు. ఆయన మరణవార్త వినగానే ఎంతో మంది సినీ ప్రముఖులు దర్శకనిర్మాతలు ఈయనతో వారి అనుబంధం గురించి తెలియజేస్తూ సోషల్ మీడియా వేదిక పోస్టు పెట్టారు. ఈ క్రమంలోనే సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు.ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా వ్యవహరించిన శివ సినిమాలో బోటనీ పాట ముంది అనే పాట ద్వారా వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.
ఇలా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలలో సిరివెన్నెల అద్భుతమైన పాటలను అందించారు. అదేవిధంగా నటనపై ఏమాత్రం ఆసక్తి లేనటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రిని రామ్ గోపాల్ వర్మ అడగడంతో తను దర్శకత్వం వహించిన గాయం సినిమాలో నటించారు.సిరివెన్నెల తన మూడు దశాబ్దాల కాలంలో నటించిన ఏకైక సినిమాగా గాయం సినిమా నిలిచిపోయింది. ఇదిలాఉండగా ఇతని మరణవార్త తెలుసుకున్న రామ్ గోపాల్ వర్మ ఎంతో ఎమోషనల్ అయ్యారు.
ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధం గురించి వెల్లడించారు.జీవితంలో ఎన్నో మంచి పనులు చేసిన మీరు తప్పకుండా స్వర్గానికి వెళతారని అక్కడ రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలకు హాయ్ చెప్పినట్లు చెప్పమని వర్మ వెల్లడించారు.అయితే తన జీవితంలో చేసిన పాపాల వల్ల తాను చనిపోతే తప్పకుండా నరకానికి వెళతానని యముడి లెక్కల్లో పొరపాట్లు జరిగితే తప్పకుండా స్వర్గానికి వస్తానని అక్కడ మనిద్దరం కలిసి అమృతంతో పెగ్గు వేద్దామని వర్మ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.