ఆయన గురించి చెబుతూ వేదికపైనే ఎమోషనల్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శివ వంటి సూపర్ హిట్ సినిమాను ప్రేక్షకులకు అందించిన రాంగోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాదాస్పదమైన సినిమాలు తీస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రతి విషయాన్ని నెగిటివ్ గా ఆలోచించే రాంగోపాల్ వర్మ అన్ని విషయాలలోనూ కలగ చేసుకొని విపాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచు వివాదాల్లో నిలుస్తూ ఉంటాడు. ఇటీవల రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న కొండ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

ప్రస్తుతం రాంగోపాల్ వర్మ ‘లడకి’ అనే ఒక నాన్ కాంట్రవర్షియల్ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా జులై 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో పూజ భలేకర్ ప్రధాన పాత్రలో నటించింది. తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈవెంట్ కి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి, కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ అతిధులుగా హాజరయ్యారు. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ గోపాల్ వర్మ తన జీవితంలోనే మొదటిసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. తన అభిమాన హీరో బ్రూస్లీ గురించి చెబుతూ వర్మ చాలా ఎమోషనల్ అయ్యాడు.

బ్రూస్లీ సినిమా చూడడం కోసం పంజాగుట్ట నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు సైకిల్ తొక్కుకుని వెళ్లే నేను ఇప్పుడు అదే బ్రూస్ లీ గురించి ఒక సినిమా చేసి సుమారు 40000 చైనా థియేటర్లలో విడుదల చేస్తున్నాను. నాకు అంతకంటే గొప్ప అచీవ్మెంట్ ఏం కావాలి అంటూ వర్మ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నేను బ్రూస్ లీ సినిమాలు చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. నేను తీసిన శివ సినిమా కూడా ఆయన సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి చేశాను అంటూ వర్మ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో నటించిన పూజ భలేకర్ సినిమా కోసం చాలా కష్టపడిందని వర్మ చెప్పుకొచ్చాడు. మామూలుగానే మగ మార్షల్ ఆర్ట్స్ చేసేవారు దొరకడమే కష్టం కానీ పూజ మాకు ఎట్టకేలకు మాకి దొరికింది. ఈ సినీమా కోసం పూజ కోవిడ్ టైం లో కూడా రోజుకి 4,5 కష్టపడింది అంటూ వర్మ చెప్పుకొచ్చాడు.