దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, వైసీపీ పార్టీ డిజిటల్ మీడియా అంతా చూసుకుంటున్నట్టుగా అందరూ చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆర్జీవీ ఆ పార్టీ కి అనుకూలంగా ట్వీట్స్ వెయ్యడం, వేరే పార్టీ వాళ్ళు వైసీపీని ఏదైనా అంటే వెంటనే వాళ్ళకి ట్విట్టర్ లో కౌంటర్ లు ఇవ్వటం, అలాగే వైసీపీ కి బాకా కొట్టడం పరిపాటి అయిపోయిందని కూడా అంటున్నారు.
తాజాగా ఆర్జీవీ స్త్రీలని ఒక తెలుగు దేశం నాయకుడు అగౌర పరిచినట్టు మాట్లాడారని, మహిళా కమిషన్ ఏమి చేస్తోందని ఆర్జీవీ ఆ పార్టీ తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నాడు. అసలు వైసీపీలో వున్న ఒక మహిళా మంత్రి ఎంతలా మాట్లాడుతున్నారో ఆర్జీవీకి ఎప్పుడూ వినిపించలేదా అని కూడా నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. అధికారంలో తమ పార్టీ వుంది కదా, ప్రతిపక్ష పార్టీ ఎవరన్నా ఏదన్నా అంటే కేసులు పెట్టడమే పనిగా చేస్తున్న అధికార పార్టీవాళ్లకి, ఆర్జీవీకి సదరు మంత్రిగారు మాట్లాడిన భాష, ఒక మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా అతన్ని ఎంత నీచంగా మాట్లాడారో వినపడలేదా. అప్పుడు మహిళా కమిషన్ ఆర్జీవీ కి గుర్తుకు రాలేదా అని నెటిజన్స్ ఒకటే ట్రోల్ చేస్తున్నారు.
అలాగే అధికార పార్టీలో ఒకప్పుడు మంత్రిగా వున్నవాడు, ఎమ్మెల్యే అయిన ఒక వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భార్య గురించి అగౌరవంగా మాట్లాడినప్పుడు ఆర్జీవీ కి ఈ మహిళా కమిషన్ గుర్తుకు రాలేదా? అని కూడా అడుగుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఆర్జీవీ తన సాంఫీుక మాధ్యమంలో తన ఇష్టం వచ్చినట్టు ఒక స్త్రీ కాళ్ళు నాకడం, చేతులు నాకటం, ఇంకా స్త్రీ అవయవాల గురించి మాట్లాడటం, ఇవన్నీ చేసినప్పుడు ఆర్జీవీకి స్త్రీ గౌరవం గురించి గుర్తుకు రాలేదా? అని నెటిజన్స్ అడుగుతున్నారు.
ఎందుకంటే ఇవన్నీ అప్పుడు ఆర్జీవీ స్వయంగా సాంఫీుక మాధ్యమాల్లో పెట్టాడు, ప్రచారం కోసం స్త్రీలను వాడుకున్నప్పుడు ఆర్జీవీకి ఇవన్నీ కనపడలేదా? అని అడుగుతున్నారు. అలాగే ఆర్జీవీ కాళ్ళు నాకే ఫోటోలను కూడా ఇప్పుడు పోస్ట్ చేసి, ఇలాంటివి అన్నీ చేసి ఇప్పుడు స్త్రీలకు గౌరవం ఇవ్వటం లేదు అని ఆర్జీవీ చెప్పటం ఏంటని నెటిజన్స్ ఒకటే ట్రోల్ చేస్తున్నారు.