Ram Charan: అభిమానులు అంటే మరీ అంత లోకువ ఏంటి చరణ్… వారి విలువ అంతేనా?

Ram Charan: రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవల రాజమహేంద్రవరంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు అయితే ఈ కార్యక్రమం ముగించుకొని తిరిగి వెళుతున్న సమయంలో ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ విషయంపై ఇప్పటికే చిత్ర బృందం స్పందిస్తూ వారి ప్రగాఢ సానుభూతి తెలియజేయడమే కాకుండా ఆర్థిక సహాయం కూడా అందించారు.

ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల పరిహారం అందించగా దిల్ రాజు ఒక్కొక్కరికి 5 లక్షలు ప్రకటించారు. అయితే తాజాగా ఈ ప్రమాదం గురించి రాంచరణ్ కూడా స్పందించారు.ఈవెంట్ దగ్గరకు వచ్చిన అభిమానులు సురక్షితంగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటాం. మన ఏపీ డిప్యూటీ సీఎం, బాబాయ్ పవన్ కల్యాణ్ కోరుకునేది కూడా అదే. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరం.

అభిమానుల కుటుంబాలు ఎంత బాధ పడతాయో నేను కూడా అంతే బాధ వ్యక్తం చేస్తున్నాను ఆ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయలు చొప్పున పరిహారం అందజేస్తున్నానని రామ్ చరణ్ తెలియజేశారు అయితే ఈయన ఇచ్చిన పరిహారంపై విమర్శలు వస్తున్నాయి. రామ్ చరణ్ కు అభిమానులు అంటే మరి అంతా లోకువనా అభిమానులు మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వటం ఏంటి ఒక అభిమాని విలువ అంతేనా అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.

మరోవైపు అల్లు అర్జున్ విషయంలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంటే ఆయన ఏకంగా పాతిక లక్షలు ఇచ్చి ఆ చిన్నారి వైద్యానికి అయ్యే ఖర్చు తానే భరిస్తానన్నా కూడా విమర్శలు చేశారు. మరి ఇప్పుడు మీరిచ్చిన పరిహారం ఎంత అంటూ కొందరు యాంటీ ఫ్యాన్స్ రామ్ చరణ్ పై విమర్శలు కురిపిస్తున్నారు. మరికొందరు మాత్రం రామ్ చరణ్ కు పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేస్తున్నారు.