ఇరుక్కుపోయిన రామ్ చరణ్.!

‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా తర్వాత రామ్ చరణ్ ఖాతాలో ‘ఆచార్య’ రూపంలో ఓ డిజాస్టర్ పడింది. దాన్ని ఏమంత పెద్దగా తీసుకోలేదు రామ్ చరణ్. అయితే, ఆయన తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మాత్రం కొంత టెన్షన్ ఏర్పడిందని ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారం.

ఈ పాటికే ఈ సినిమా పూర్తయిపోయి వుండాలి. టైమ్ అంతా వేస్ట్ అయిపోతోంది చరణ్‌కి. ఈ సినిమా కమిట్‌మెంట్‌తో మరో సినిమాని కమిటెడ్‌గా పట్టాలెక్కించలేకపోతున్నాడట రామ్ చరణ్.

నిజానికి ఆల్రెడీ ఓ ప్రాజెక్ట్ సెట్ చేసి పెట్టుకున్నాడు రామ్ చరణ్. అదే ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు సన డైరెక్షన్‌లో చేయాల్సిన మూవీ. స్టార్ట్ చేసి వుంటే, ఈ సినిమా ఈ పాటికే ఓ కొలిక్కి వచ్చి వుండేది.

కానీ, శంకర్ సినిమా కారణంగా చరణ్ కన్‌ఫ్యూజన్‌లో పడిపోయాడు. టైటిల్ పరంగా కూడా ఈ సినిమా అంతగా జనంలోకి వెళ్లడం లేదు. సినిమాపై బజ్ క్రియేట్ కావడం లేదు. ఏదో ఒకటి చేసి వున్న పళంగా సినిమాపై బజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాడట రామ్ చరణ్.

అయితే, శంకర్‌తో అంత ఈజీ కాదు. ఇదిలా వుంటే, శంకర్‌కీ, రామ్ చరణ్‌కీ మధ్య ఎక్కడో యవ్వారం బెడిసి కొట్టిందన్న ప్రచారం కూడా వుంది.