రకుల్ ప్రీత్ ప్రస్తుతం మేడే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ అమితాబ్ బచ్చన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మేడే సినిమా షూటింగ్ రెగ్యులర్ జరుగుతూనే ఉంది. గత నెల నుంచి హైద్రాబాద్‌లోనే చిత్రయూనిట్ షూటింగ్ జరుపుకుంటోంది. ఆ మధ్య రకుల్‌కు కరోనా రావడంతో షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చేసింది. అయితే పది రోజుల క్వారంటైన్ తరువాత కరోనా తగ్గడంతో మళ్లీ వెంటనే షూటింగ్‌లతో బిజీ అయిపోయింది.
ఈ మధ్య రకుల్ టైం వేస్ట్ చేయడమే లేదు. ఉదయాన్నే సైక్లింగ్ చేస్తూ సెట్‌కు వెళ్తోంది. అలా టైంను సేవ్ చేస్తూ మొత్తానికి రకుల్ అందరినీ ఆకట్టుకుంటోంది. రకుల్ అలా వ్యాయామం చేసినట్టు, సెట్‌లో టైంకి ఉన్నట్టు రెండు పనులు జరిగిపోతున్నాయి. మేడే యూనిట్ సంక్రాంతి సెలెబ్రేషన్స్‌ను ఓ రేంజ్‌లో చేసుకుంది. యూనిట్ మొత్తం భోగి మంటల చుట్టూ ఆడుతూ పాడుతూ తిరిగారు. ఓ వైపు షూటింగ్ మరో వైపు భోగి మంటలతో రకుల్ ఫుల్ ఖుషీ అయింది.
ఇక తాజాగా రకుల్ ఓ పోస్ట్ చేసింది. మామూలుగా వీకెండ్ ఎంజాయ్ చేశాక.. సోమవారం ఎవ్వరికైనా సరే పనిలోకి వెళ్లాలంటే కాస్త బద్దకంగా ఉంటుంది. పని చేసే మూడ్ ఉండదు. ఎలాగైనా తప్పించుకోవాలని చూస్తారు. రకుల్ కూడా అదే ధ్యాసలో ఉన్నట్టుంది. సోమవారం పని అంటే ఇలాగే ఉంటుందంటూ కొంటెగా కన్ను కొట్టింది. మొత్తానికి రకుల్ మాత్రం ఫుట్ బిజీగా ఉంటోంది. వరుస ప్రాజెక్ట్‌లతో తెగ రచ్చ చేస్తోంది.