రకుల్ ప్రీత్ ఇప్పుడు అందరి కంటే ఎక్కువ బిజీగా ఉంది. వరుసగా సినిమాలను ఓకే చెబుతూ హల్చల్ చేస్తుంది. నిత్యం ఏదో ఒక సెట్‌లో ఉంటోంది. వరుసగా సినిమా ప్రాజెక్ట్‌లను ఓకే చేయడంతో ఇప్పుడు రకుల్ డైరీ ఖాళీగా లేనట్టు కనిపిస్తోంది. మొన్నటి వరకు అజయ్ దేవగణ్, అమితాబ్ బచ్చన్ మేడే షూటింగ్‌తో బిజీగా ఉంది. ఇక నిన్నటి వరకు శివ కార్తికేయన్ సినిమాతో ఫుల్ రచ్చ చేసింది.
అయలాన్ అనే కోలీవుడ్ ప్రాజెక్ట్‌తో రకుల్ బిజీగా ఉంది. సాంగ్ షూటింగ్‌లో బాగా కాళ్లు పట్టేసినట్టున్నాయి. నిన్న మసాజ్ చేయించుకుంటూ కాస్త రిలాక్స్ అయినట్టుంది. ఇక నేటితో అయలాన్ షూటింగ్ పూర్తి కానున్నట్టు తెలుస్తోంది. దీంతో శివ కార్తికేయన్‌కు రకుల్ బై చెప్పేస్తుంది. ఇక ఇది పక్కన పెడితే తెలుగులో మరి కొన్ని ప్రాజెక్ట్‌లున్నాయి. ఇప్పుడు అయితే నితిన్ హీరోగా వస్తోన్న చక్ర సినిమాతో బిజీగా ఉంది.
ఇక నేడు మరో సినిమా కూడా ప్రారంభమైంది.బాలీవుడ్‌లో నేడు రకుల్ కొత్త మూవీ ప్రారంభమైంది. అజయ్ దేవగణ్, సిద్దార్థ్ మల్హోత్ర కాంబినేషన్‌లో వస్తోన్న థ్యాంక్ గాడ్ చిత్రం మూవీ నేడు లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఆ మూవీ ప్రారంభోత్సవ వేడుకల్లో రకుల్ పాల్గొనలేదు. ఎందుకంటే రకుల్ కోలీవుడ్ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉంది. ఇంకా రకుల్ చేతిలో రెండు మూడు బాలీవుడ్ ప్రాజెక్ట్‌లున్నాయి. ఇలా అక్కడా ఇక్కడా క్షణం తీరిక లేకుండా రకుల్ బిజీగా ఉండటం చూసి అందరూ షాక్ అవుతోన్నట్టు కనిపిస్తోంది.