Home Entertainment అలాంటి వార్తలు రావడమేంటి.. రకుల్‌కు ఇదేం కర్మరా బాబు!!

అలాంటి వార్తలు రావడమేంటి.. రకుల్‌కు ఇదేం కర్మరా బాబు!!

రకుల్ ప్రీత్‌పై నిత్యం ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. రకుల్ అది చేస్తోంది.. ఇది చేస్తోంది.. అక్కడి వెళ్లింది.. ఇక్కడకు వచ్చింది.. సినిమాల్లేవు.. ఖాళీగా ఉంటోంది.. రకుల్ సినిమాలను రిజెక్ట్ చేస్తోంది.. ఇలా ఏవేవో రూమర్లు వస్తూనే ఉంటాయి. కొన్నింటికి రకుల్ స్వయంగా సమాధానం ఇస్తూ ఉంటుంది. మరికొన్నింటిని అలా వదిలేస్తుంది. ఇక కొన్నింటిపై తన టీంతో రియాక్షన్ ఇప్పిస్తుంది. తాజాగా రకుల్ అలాంటి పనే చేసింది.

Rakul Preet Team Condemns About Future Projects
Rakul Preet Team Condemns About Future Projects

ప్రస్తుతం రకుల్ మాల్దీవుల్లో ఎంజాయ్ చేసి ఇంటికి తిరిగి వచ్చింది. తన పేరెంట్స్ 31వ వివాహా వార్షికోత్సవ వేడుకలను మాల్దీవుల్లో ఘనంగా నిర్వహించింది. ఈ వెకేషన్‌లో రకుల్ బికినీలో చేసిన రచ్చ మామూలుగా లేదు. సోషల్ మీడియా మొత్తాన్ని హీటెక్కించింది. ఆ విషయాలను కాసేపు పక్కనపెడితే.. రకుల్ టీం తాజాగా ఓ క్లారిటీ ఇచ్చింది. రకుల్‌కు ఎలాంటి ప్రాజెక్ట్‌లు రావడం లేదని, ఖాళీగా ఉందని పిచ్చి పిచ్చి రూమర్లు వస్తున్నాయట.

వాటిపై రకుల్ మేనేజర్ స్పందించాడు. రకుల్ ప్రాజెక్ట్‌లపై వస్తోన్న రూమర్లను ఖండించాడు. రకుల్ ప్రస్తుతం నితిన్ చక్ర సినిమాలో, క్రిష్ వైష్ణవ్ తేజ్ సినిమాలో, తమిళంలో శివ కార్తికేయన్ సినిమాలో నటిస్తోందని తెలిపాడు. హిందీలో జాన్ అబ్రహం, అర్జున్ కపూర్‌ సినిమాల్లో నటిస్తోందన్నాడు. రీసెంట్‌గా అమితాబ్ అజయ్ దేవగణ్ సినిమాలో ఎంపికైందని క్లారిటీ ఇచ్చారు. అలాంటి రూమర్లు రావడం ఏంటో.. ఇలా క్లారిటీలు ఇవ్వడం ఏంటో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Rakul Preet, Rakul Preet Singh, రకుల్ ప్రీత్

- Advertisement -

Related Posts

రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

ఒక మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఒకప్పుడు అభిమానులు నమ్మేవారు కాదు. అయితే చాలా కాలం తరువాత అగ్ర హీరోలు ఈగోలను పక్కనపెట్టే సినిమాలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక...

స్టార్ హీరో పెళ్లి వేడుక.. మాజీ లవ్ బర్డ్స్ కు స్పెషల్ ఇన్విటేషన్

బాలీవుడ్ లో త్వరలో ఒక యువ హీరో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ హిందీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుకుంటున్న వరుణ్ ధావన్ త్వరలో...

నేను చస్తే వాటికి ఆహారం అవుతాను.. కమెడియన్ వింత కోరిక

సాధారణంగా ఎవరైనా సరే చనిపోతే అవయవదానం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరికొందరు ఉన్నతమైన వారు తన శరీరం జూనియర్ డాక్టర్స్ కు ఉపయోగపడాలని ఏకంగా బాడీని మెడికల్ కాలేజ్ కోర్సుల కోసం...

డిజాస్టర్ టాక్ వచ్చినా డోస్ తగ్గలేదు.. మాస్టర్ కు అప్పుడే అన్ని కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ 100కోట్లకు తక్కువగా రాబట్టవు. కథలో మ్యాటర్ లేకపోయినా కూడా విజయ్ క్యారెక్టర్ ను సరిగ్గా ఎలివేట్ చేస్తే...

Latest News