రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఎక్కడుందో అందరికీ తెలిసిందే. మాల్దీవుల్లో కుటుంబ సభ్యులతో కలిసి రచ్చ రచ్చ చేస్తోంది. సోదరుడితో కలిసి సముద్రంలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. బికినీ ఫోటోలతో సోషల్ మీడియాకు నిద్ర పట్టకుండా చేస్తోంది. మొత్తానికి రకుల్ మాత్రం వార్తల్లోట్రెండ్ అవుతూనే ఉంది. మాల్దీవుల్లో ఫ్యామిలీతో సందడిగా గడుపుతున్న రకుల్.. అసలు అక్కడికి ఎందుకు వెళ్లిందో తాజాగా బయటకు చెప్పేసింది. గతంలోనూ ఓసారి ఇలానే.. తల్లిదండ్రులను తీసుకుని రకుల్ బయటకు చెక్కేసింది.
అయితే ఈ సారి మాత్రం స్పెషల్ ప్లాన్ వేసి మరీ మాల్దీవులకు తీసుకెళ్లినట్టుంది. రకుల్ పేరెంట్స్ వివాహా వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు మాల్దీవుల్లో స్పెషల్ అరేంజ్మెంట్స్ చేసింది రకుల్. తాజాగా రకుల్ ఓ వీడియోను షేర్ చేసింది. సాయంకాలానా.. సాగర తీరానా అన్నట్టు.. రకుల్ పేరెంట్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. క్యాంప్ ఫైర్ పెట్టి సాల్సా డ్యాన్సులు చేస్తున్నారు. లైట్ మ్యూజిక్‌లో రొమాంటిక్ స్టెప్పులు వేస్తూ రకుల్ పేరెంట్స్ దుమ్ములేపుతున్నారు.
తన పేరెంట్స్ మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేసేలా వీడియోను షేర్ చేస్తూ.. అదిరిపోయే కామెంట్స్ చేసింది. నాకు ప్రేమపైన అత్యంత నమ్మకం కలగడానికి కారణం వీరిద్దరే అంటూ తన పేరెంట్స్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. రకుల్ తన పేరెంట్స్ 31వ వివాహా వార్షికోత్సవాన్ని సెలెబ్రేట్ చేస్తున్నట్టు తెలిపింది. మొత్తానికి ఇలా రకుల్ మాత్రం ఫ్యామిలీతో కలిసి మాల్దీవుల్లో తెగ హల్చల్ చేస్తోంది.