Rakul Preet Singh:దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్ర తారగా ఓ వెలుగు వెలిగిన నటి రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సౌత్ సినిమాలను పక్కన పెట్టి బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టారు.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అయిదారు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. బాలీవుడ్లో ఈమె నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా సినిమా గురించి మాత్రమే కాకుండా తన ప్రియుడు గురించి ప్రశ్నలు ఎదురవడంతో రకుల్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నాని అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే.గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్నప్పటికీ వీరి ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచిన రకుల్ ప్రీత్ సింగ్ గత కొన్ని నెలల క్రితం వీరి ప్రేమ గురించి బయటపెట్టి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని వెల్లడించారు. ఈ క్రమంలోనే వీరి పెళ్లి వార్త కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమెకు తన ప్రియుడు జాకీ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
అయితే ఈ విషయంపై రకుల్ ప్రీతి స్పందిస్తూ పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో సర్వ సాధారణంగా జరిగే అంశం. మన జీవితంలో తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఎలా అయితే భాగం అవుతారో భర్త కూడా అలాగే భాగం అవుతారని ఇలా పదేపదే అతని గురించి అడుగుతూ పెళ్లి గురించి ప్రశ్నలు వేయకండి. సమయం వచ్చినప్పుడు నేనే వాటి గురించి చెబుతాను. ఇలా తరచూ అతని గురించి అడుగుతూ విసిగించకండి అంటూ రకుల్ ప్రీత్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ప్రియుడు గురించి అడిగితే రకుల్ ఇలా డైరెక్ట్ గా అందరికీ క్లాస్ పీకడానికి గల కారణం ఏమిటి అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.