మళ్లీ అడవుల్లో ప్రత్యక్షమైన ర‌కుల్ ప్రీత్ సింగ్.. ఫుల్ స్పీడ్‌గా ఉంది!!

Rakul Preet Came Back To Vikarabad Forest For Shoot

ఈ మధ్య కాలంలో నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ అయిన సెలెబ్రిటీ లిస్ట్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంది. దేశంలోని చిత్ర పరిశ్రమలను డ్రగ్స్ కేసులు పట్టికుదిపేస్తున్నాయి. బాలీవుడ్‌లో రియా చక్రవర్తి అరెస్ట్… శాండిల్‌వుడ్‌లో సంజనా గల్రానీ, రాగిణి ద్వివేది అరెస్ట్‌లు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. రియా చక్రవర్తి విచారణలో భాగంగా రకుల్ పేరు చెప్పిందని మీడియా వార్తలు రాసింది. దీంతో దేశ వ్యాప్తంగా రకుల్ పేరు మార్మోగిపోయింది.

Rakul Preet Singh came back to vikarabad forest for shoot
Rakul Preet Singh came back to vikarabad forest for shoot

నిత్యం వ్యాయమాం, ఫిట్నెస్, వెజిటేరియన్ అంటూ కాకమ్మ కబుర్లు చెబుతావ్.. మళ్లీ డ్రగ్స్ తీసుకుంటావ్ అని రకుల్‌ని నానా రకాలుగా ట్రోల్స్ చేశారు. డ్రగ్స్ కేసులో రకుల్ పేరు మార్మోగుతుండగా.. వికారాబాద్‌లో షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ వెళ్లిపోయింది. ముంబై వెళ్లి అక్కడి వ్యవహారాలను చక్కదిద్దుకుంది. ఢిల్లీ హైకోర్టును తన గోడును విన్నవించుకుంది. తనపై తప్పుడు వార్తలను ప్రచురించిన మీడియాపై చర్యలు తీసుకోవాలని కోరింది.

Rakul Preet Singh came back to vikarabad forest for shoot
Rakul Preet Singh came back to vikarabad forest for shoot

రియా ఎలంటి పేర్లు చెప్పలేదని ఎన్‌సీబీ అధికారులు స్పష్టం చేశారు. దీంతో డ్రగ్స్ కేసుకు రకుల్‌కు ఎలాంటి సంబంధం లేదని తేలిపోయింది. ఇక వ్యవహారం అంతా చక్కబడినందుకు మళ్లీ షూటింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రాబోతోన్న ఈ మూవీ షూటింగ్ వికారాబాద్ అడవుల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ అడవుల్లో రకుల్ ప్రత్యక్షమైందని, షూటింగ్ కూడా ఫుల్ స్పీడ్‌గా చేసేస్తున్నారని తెలుస్తోంది.