రకుల్ ప్రీత్ సింగ్ ఇదివరకు చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్స్ అందుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మన్మథుడు సినిమా ఉహీంచని షాక్ ఇచ్చింది. అంతే కాకుండా ఆమె అందులో సిగరెట్ తాగడం యాంకర్ ఝాన్సీతో లిప్ లాక్ సీన్ వంటివి చేయడంతో ఓ వర్గం నుంచి ట్రోలింగ్స్ గట్టిగానే వచ్చాయి. ఇక మొత్తానికి తెలుగులో ఎదో ఒక విధంగా ఛాన్స్ లు అందుకుంటోంది.
క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాను పూర్తి చేసిన అమ్మడు నితిన్ చెక్ సినిమాలో కూడా నటించింది. ఇక ఆ సినిమాలతో పాటు బాలీవుడ్ కో వరుసగా ఐదు సినిమాలను లైన్ లో పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఆయుష్మాన్ ఖురానాతో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది. మరోవైపు టాలీవుడ్ భామ పూజా హెగ్డే నెమ్మదిగా అడుగులు వేస్తుంటే రకుల్ మాత్రం ఏకంగా రెమ్యునరేషన్ డోస్ పెంచి మరి తన రేంజ్ ను పెంచుకుంటోంది.
మొన్నటి వరకు ఈ బ్యూటీకి కోటి ఇస్తేనే గ్రేట్ అన్నారు. లక్షల్లోన్నే రెమ్యునరేషన్ అందుకున్నట్లు టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు బిజీగా ఉన్న రకుల్ కోటిన్నర దాకా రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తోందట. దాదాపు పూజా హెగ్డే కూడా అదే తరహాలో వేలుతోంది. మరో రెండు హిట్లు పడితే బుట్టబొమ్మను డామినేట్ చేయడం చాలా ఈజీ. మరి రకుల్ వచ్చిన అవకాశాలను ఎంతవతకు యూజ్ చేసుకుంటుందో చూడాలి.