రకుల్ ప్రీత్ అంటే ఫిట్ నెస్.. ఫిట్ నెస్ అంటే రకుల్ ప్రీత్ అనేలా మారిపోయింది. ఒకప్పుడు ఎంతో ముద్దుగా, చబ్బీగా ఉండే రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు సన్నగా, బక్క పల్చగా మారిపోయింది. జీరో సైజ్ అంటూ రకుల్ ప్రీత్ మరీ దారుణంగా ఎండిపోయినట్టు అయిపోయింది. ఆ మధ్య రకుల్ ప్రీత్ లుక్స్‌పైన నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. అయినా కూడా రకుల్ ప్రీత్ తన పంథాను మారలేదు. ఇంకా వర్కవుట్లు చేస్తూనే ఉంది. ఇక కరోనా వచ్చి వెళ్లాక ఆ వర్కవుట్ల స్థాయి మరీ పెరిగింది.
కరోనా వల్ల కోల్పోయిన శక్తి, ఫిట్ నెస్ అంతా కూడా తిరిగి తెచ్చుకునే పనిలో పడింది. అందుకే అది వీకెండ్ అయినా, సోమవారం అయినా కూడా వర్కవుట్లు చేయడం మాత్రం ఆపడం లేదు. వరుసగా షూటింగ్‌లతో బిజీగా ఉన్న రకుల్.. ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలను ఊపేస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. రకుల్ ఇప్పుడు వర్కవుట్లతో రచ్చ చేస్తోంది.
అయితే ఈ మేరకు తాను జిమ్‌లో కష్టపడుతున్న వీడియోలను షేర్ చేసింది. మామూలుగా వ్యాయామం చేసేటప్పుడు బరువులు ఎత్తాల్సి ఉంటుంది. మొత్తానికి రకుల్ మాత్రం మళ్లీ తన ఫిట్ నెస్‌ను తిరిగి తెచ్చుకునే పనిలో బాగానే బిజీగా ఉంది. అలా ఎక్సర్ సైజ్ చేసే చివరకు అలా అయిపోతానని చెప్పుకొచ్చింది. రకుల్ ప్రస్తుతం హిందీ చిత్రాలైన మేడే, థ్యాంక్ గాడ్ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంది. రకుల్ నితిన్ కాంబోలో రాబోతోన్న చెక్ సినిమా ఫిబ్రవరిలోనే విడుదల కానుంది.