కేరవ్యాన్‌లో అలాంటి పనులు.. కొత్త సినిమా జోష్‌లో రకుల్!!

Rakul Preet Joins Thank God Set

రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో ఎంత సందడిగా ఉంటుందో అందరికీ తెలిసిందే. వరుసగా సినిమాలను చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. మొన్నటి వరకు కోలీవుడ్ సినిమాతో ఫుల్ బిజీగా ఉంది. శివ కార్తికేయన్ హీరోగా వస్తోన్న అయలాన్ చిత్రంతో రకుల్ సెట్‌లో సందడి చేసింది. ఈ మధ్యే సినిమాకు గుడ్ బై చెప్పేసింది. అక్కడ సినిమా షూటింగ్ పూర్తయిందో లేదో వెంటనే మరో ప్రాజెక్ట్‌కు రెడీ అయింది. తాజాగా రకుల్ తన కొత్త సినిమా సెట్‌లో అడుగుపెట్టేసింది.

Rakul Preet Joins Thank God Set
Rakul Preet Joins Thank God Set

కొత్త సినిమా సెట్‌లోకి అడుగుపెట్టేప్పుడు ఇలానే హ్యాపీగా ఉంటాను అని రకుల్ చెప్పుకొచ్చింది. రకుల్ ప్రీత్, సిద్దార్థ్ మల్హోత్ర, అజయ్ దేవగణ్ కాంబోలో వస్తోన్న థ్యాంక్ గాడ్ సినిమా షూటింగ్ మొన్నీమధ్యే ప్రారంభమైంది. అయితే రకుల్ ఆ మూవీ సెట్‌లోకి అడుగుపెట్టేసింది. ఈ మేరకు పాత్రకు తగ్గట్టుగా మేకప్ వేసేసుకుంది. అంతే కాకుండా కేరవ్యాన్‌లోనే రకుల్ తన వ్యాయామాలు కూడా చేసేస్తోంది. వీటికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది.

మేకప్ వేశాక రకుల్ తన వామ్ అప్ ప్రక్రియను చేసుకుంది. రకుల్ ఏం చేస్తున్నావ్.. అని అడిగితే.. స్ట్రెచింగ్ చేస్తున్నాను.. నా ఎనర్జీని తిరిగి తెచ్చుకుంటున్నాను చెప్పింది. మొత్తానికి థ్యాంక్ గ్యాడ్ యూనిట్‌తో కలిసిరచ్చ చేసేందుకు రకుల్ సర్వం సిద్దంగా ఉంది. రకుల్ ఈ మూవీ తరువాత మళ్లీ మేడే సెట్‌లో అడుగుపెట్టనుంది. ఆ తరువాత రకుల్ మళ్లీ తెలుగు సినిమాలతో బిజీగా ఉంటుందేమో చూడాలి. రకుల్ నితిన్ నటించిన చెక్ ఫిబ్రవరి 19న రాబోతోంది.