రకుల్ మామూల్ది కాదు.. స్పీడ్ పెంచేసింది!

Rakul Preet joins may Day Set

రకుల్ ప్రీత్ సింగ్‌పై ఆ మధ్య ఎన్నో రూమర్లు వచ్చాయి. సినిమాలు లేవని, అవకాశాలు పూర్తిగా సన్నగిల్లిపోయాయని ఇలా రకరకాలుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై రకుల్ మేనేజర్ స్పందించాడు. ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌ల చిట్టాను బయటకు తీశాడు. ఎన్ని సినిమాలు చేస్తోంది అవి ఏ దశలో ఉన్నాయనే విషయాలను పూస గుచ్చినట్టు వివరించాడు. ఆల్రెడీ క్రిష్ వైష్ణవ్ తేజ్ కాంబోలో రాబోతోన్న మూవీ షూటింగ్ పూర్తయిందని చెబుతూనే మిగతా ప్రాజెక్ట్‌ల వివరాలను తెలిపారు.

Rakul Preet joins may Day Set
Rakul Preet joins may Day Set

నితిన్ చెక్ మూవీ చిత్రీకరణ దశలోఉందని పేర్కొన్నారు. తమిళంలో ఓ సినిమా రెడీగా ఉందన్నారు. ఇక హిందీలో మూడు సినిమాలున్నాయని తెలిపారు. అమితాబ్, అజయ్ దేవగణ్ కాంబోలో రాబోతోన్న మే డే సినిమాతో రకుల్ ఎంపికైందని కూడా వెల్లడించారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఇటివలె ప్రారంభమైన సంగతి తెలిసిందే. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మూవీ షూటింగ్ గత వారమే ప్రారంభమైంది. అయితే ఈ మూవీ షూటింగ్‌లో రకుల్ జాయిన్ కాబోతోంది.

తాజాగా రకుల్ మేడే సెట్‌లో అడుగుపెట్టేందుకు రెడీ అయింది. మేకప్ రూంలో బిజీబిజీగా ఉన్న రకుల్ మేడే అప్డేట్ ఇచ్చింది. మేకప్ రూంలో రకుల్‌ను రెడీ చేస్తుండగా..వీడియో తీసింది. యాయ్ యాయ్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నానంటూ మేడే గురించిచెప్పేసింది. మొత్తానికి రకుల్ స్పీడ్ మాత్రం మామూలుగా లేదు. అటు క్రిష్ సినిమా పూర్తయిందో లేదో ఇటు క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్‌ను ప్రారంభించేసింది. మళ్లీ త్వరలోనే అర్జున్ కపూర్ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతోన్నట్టు తెలుస్తోంది.