రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో ఎంత సరదాగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో వచ్చే నెగెటివ్ కామెంట్లకు అంతే స్థాయిలో సమాధానమిస్తుంది. ఆ మధ్య కారులో సెషన్ అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్.. దానికి రకుల్ ఇచ్చిన రిప్లై నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయింది. సెషన్ అంటూ నెటిజన్ దారుణంగా మాట్లాడటంతో.. రకుల్ కూడా అతని అమ్మ ప్రస్థావన తెస్తూ రివర్స్ కౌంటర్ వేసింది. అది కాస్త రకుల్‌కే నెగెటివ్ అయింది.
రకుల్ చేసే పనులు కూడా అలానే ఉంటాయని అప్పటి వరకు మద్దతు నెటిజన్లు కూడా రివర్స్ అయ్యారు. తాజాగా రకుల్ మళ్లీ అలాంటి పనులే చేస్తోంది. రకుల్ ప్రీత్ మాల్దీవుల్లో ఫ్యామిలీతో కలిసి రచ్చ చేస్తోంది. అయితే అక్కడి వరకు బాగానే ఉంది.. బికినీ ధరించి బీచ్‌లో నానా హంగామా చేస్తోంది. అది కూడా బాగానే ఉంది. కానీ పక్కనే సోదరుడిని పెట్టుకుని అతనితోనే సెల్ఫీలు దిగుతూ బికినీలో అందాలను ఆరబోస్తుంది.
సముద్రంలో దిగుతూ.. సెల్పీ స్టిక్‌తో సోదరుడితో కలిసి రచ్చ చేస్తోంది. బికినీలో రకుల్ చేసిన రచ్చ కంటే పక్కనే సోదరుడిని పెట్టుకుని అలా చేస్తావా? అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. రకుల్ ఫ్యామిలీ మొత్తం మాల్దీవుల్లో ప్రస్తుతం సందడి చేస్తోంది. ఇటీవలె రకుల్ ఓ భారీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ కొట్టేసింది. అమితాబ్ అజయ్ దేవగణ్ కాంబోలోరాబోతోన్న మేడే చిత్రంలో రకుల్ నటించనుంది.