Home Entertainment అదిరిపోయే ఆఫర్.. రకుల్ లక్కు మామూలుగా లేదు!!

అదిరిపోయే ఆఫర్.. రకుల్ లక్కు మామూలుగా లేదు!!

టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్.. ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా అంతటా స్టార్డంను సంపాదించుకుంది. అయితే ఆ మధ్య రకుల్ కొత్త ప్రాజెక్ట్‌లు ఏవీ ప్రకటించలేదు. తెలుగులోనూ లక్ కలిసి రాక కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదు. బాలీవుడ్‌లో చేసిన సినిమాలన్నీ బెడిసి కొడుతూ వచ్చాయి. కోలీవుడ్‌లోనూ రకుల్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అలాంటి రకుల్‌కు అదృష్టం దురదృష్టంలా పట్టినట్టుంది. ఏకంగా బిగ్ బీ అమితాబ్ పక్కన నటించే చాన్స్ కొట్టేసింది.

Rakul Preet Came On Board Ajay Devgan Amitabh May Day Movie
Rakul Preet Came on board Ajay Devgan Amitabh May Day Movie

ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. చాలా ఏళ్ల తరువాత మళ్లీ అజయ్ దేవగణ్ ఓ సినిమాను డైరెక్ట్ చేయబోతోన్నాడు. అది కూడా అమితాబ్‌ను ప్రధాన పాత్రలో పెట్టి ఓ సినిమాను నిర్మించబోతోన్నాడు. దర్శకుడు నిర్మాతగా ఉండటమే కాకుండా అజయ్ దేవగణ్ ఓ స్పెషల్ రోల్‌ను పోషించబోతోన్నాడు. మేడే అంటూ టైటిల్‌ను ఆ మధ్య రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలో రకుల్‌కు ఓ మంచి ఆఫర్ వచ్చింది. ఈ మేరకు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.

అజయ్ దేవగణ్ రకుల్ కాంబోలో ఇంతకు ముందు దే దే ప్యార్ దే అనే చిత్రం వచ్చింది. అక్కడ ఏర్పడిన బంధంతోనే రకుల్ ప్రీత్‌కు మేడే సినిమాలో చాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నాను.. ఎంతగానో థ్రిల్ అయ్యాను.. మేడే చిత్రంలో ఎంపికవ్వడం కో పైలెట్‌గా నటించడం అది కూడా అమితాబ్ సర్ పక్కన.. నా కల ఈ రోజు నెరవేరింది.. నన్ను కూడా ఈ ప్రయాణంలో భాగం చేసి టేకాఫ్ ఇస్తున్నందుకు థ్యాంక్స్ అని రకుల్ ట్వీట్ చేసింది.

- Advertisement -

Related Posts

Gouri G Kishan Latest Photos

Gouri G Kishan Popular actress in tamil, Gouri G Kishan latest photos in shooting spot, Gouri G Kishan beautiful images, Gouri G Kishan, Gouri...

ప్ర‌భాస్ ఖాతాలో ఫాస్టెస్ట్ రికార్డ్‌.. అతి త‌క్కువ టైంలో ఆరు మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ సొంతం

రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్ర‌భాస్ ఛ‌త్ర‌ప‌తి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇందులో ప్ర‌భాస్ న‌ట‌న‌, ఆయ‌న నోటి నుండి వెలువ‌డిన డైలాగులు ప్రేక్ష‌కుల‌ని...

జాతీయ జెండాను ఆవిష్క‌రించిన చిరంజీవి.. జెండా పండుగ వేడుక‌లో పాల్గొన్న‌ మెగా ఫ్యామిలీ

72వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు దేశవ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ప్ర‌తి ఒక్క‌రు సంప్ర‌దాయ దుస్తులు ధరించి ఉద‌యాన్నే జాతీయ జెండా ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి త‌ను స్థాపించిన చిరంజీవి బ్ల‌డ్...

‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ .. సెట్స్ లో అడుగుపెట్టిన పవన్ !

టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణాదగ్గుబాటి ల కాంబినేషన్ లో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా నిర్మిస్తున్న చిత్రం రెగ్యులర్...

Latest News