Jabardasth: జబర్దస్త్ వేదికపై నిశ్చితార్థం జరుపుకున్న రాకేష్ సుజాత.. ప్రోమో వైరల్!

Jabardasth: ప్రతి వారం బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ గా ఈ కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.ఈ క్రమంలోనే ఈ శుక్రవారం ప్రసారం కాబోయే ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఎప్పటిలాగే కమెడియన్స్ తమదైన శైలిలో వారి అద్భుతమైన స్కిట్ ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు.

ఇక ఈ ప్రోమోలో భాగంగా జబర్దస్త్ వేదికపైనే రాకింగ్ రాకేష్, సుజాత నిశ్చితార్థం జరుపుకోవడం ఈ ప్రోమోకి హైలెట్ గా మారింది. నిజ జీవితంలో ప్రేమలో ఉన్నటువంటి ఈ జోడి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం మనకు తెలిసిందే అందుకే జబర్దస్త్ వేదికపై పెళ్లి దుస్తులలో ఎంతో అందంగా ముస్తాబైన ఈ జంట ఈ వేదికపై నిశ్చితార్థం జరుపుతున్నట్లు తెలుస్తోంది.
YouTube video player

ఈ ప్రోమోలో భాగంగా రాకింగ్ రాకేష్ సుజాత వేలికి రింగ్ తొడిగారు. ఈ దృశ్యాలు ఎంతో అందంగా ఉన్నాయి. ఇలా రాకేష్ సుజాత వేలికి ఉంగరం తోడుగుతూ నీ పెళ్లి అయిపోయిందిపో అంటూ సుజాతకు ఝలక్ ఇచ్చాడు. ఇక ఈ ప్రోమోలో నిశ్చితార్థం వేడుక అందరిని ఆకట్టుకుంది. బుల్లెట్ భాస్కర్ వెరైటి గెటప్స్ లో ప్రేక్షకులను సందడి చేశారు. ఆటో రాంప్రసాద్ లేడీ గెటప్ లో వచ్చి ఇంద్రజలాగా డైలాగులు చెబుతూ అందరిని ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.