గాడ్ ఫాదర్ సినిమా చూసిన రజినీకాంత్… సూపర్ స్టార్ రివ్యూ ఇదే?

మోహన్ రాజ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్.ఈ సినిమా మలయాళంలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న లూసిఫర్ సినిమాకి రీమేక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా విజయదశమి సందర్భంగా విడుదలై మొదటి వారంలోనే 100 కోట్ల వస్తువులను రాబట్టి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా యూఎస్ఏ లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టినట్టు మేకర్స్ అధికారకంగా వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా మొదటి వారంలోని బ్రేక్ ఈవెన్ సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరడంతో ఈ స్పెషల్ పోస్టర్ నుడైరెక్టర్ మోహన్ రాజా సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఇకపోతే డైరెక్టర్ మోహన్ రాజా గాడ్ ఫాదర్ సినిమాని తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ చూశారని తన అభిప్రాయాన్ని కూడా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా చూశారని ఆయన ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారని మోహన్ రాజా వెల్లడించారు.

గాడ్ ఫాదర్ సినిమాపై రజనీకాంత్ స్పందిస్తూ సినిమా తీర్చిదిద్దిన తీరు బాగుందని,మూవీ ఎక్స్లెంట్, నైస్, ఇంట్రెస్టింగ్ అని రజినీకాంత్ అన్నారు.మా సినిమాని మీరు ప్రశంసించడం చాలా గొప్పగా ఉంది ధన్యవాదాలు సర్ అంటూ మోహన్ రాజా ఈ సందర్భంగా రజినీకాంత్ ప్రశంసలను తెలియజేస్తూ రజినీకాంత్ కు ధన్యవాదాలు తెలియజేశారు.ఇక గాడ్ ఫాదర్ సినిమా భారీ హిట్ కావడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత భారీ హీట్ అందుకోవడంతో మెగా ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.