Rajinikanth -Aishwarya: రజనీ, ఐశ్వర్య కాంబోలో మరో సినిమా… రజనీ మళ్ళీ హిట్ కొట్టనున్నాడా ?

Rajinikanth -Aishwarya:అందం లేకపోయినా టాలెంట్ ఉంటే ఎక్కడైనా ముందుకు సాగచ్చు అన్న వాక్యానికి బెస్ట్ నిదర్శనంగా నిలిచే నటుడు, సూపర్ స్టార్ రజనీ కాంత్. తమిళ్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినా, తెలుగులోనూ తన నటనా ప్రతిభతో ఎనలేని అభిమానాన్ని చూరగొన్నాడు ఈ స్టార్ హీరో. నేటి తరం హీరోలతో సమానంగా పోటీ పడుతూ వయసుతో సంబంధం లేకుండా సినిమాల్లో హావభావాలు ప్రదర్శిస్తూ పలువురి మన్ననలు రజనీ పొందుతున్నారు. ఇక బస్ కండక్టర్ స్థాయి నుంచి వచ్చి ఈ రోజు నేషనల్ లెవెల్ లో అందరికీ తన టాలెంట్ ఏంటో తెలిసేలా చేసిన రజనీ కాంత్ ను చూసి చాలా నేర్చుకోవచ్చు అన్పిస్తుంది. ఇక ఆయన ఎక్కడైనా ఒకేలా ఉండడం, సింప్లిసిటీని మెయింటైన్ చేయడం వంటివి ఆయన స్థాయిని ఎక్కడికో తీసుకెళ్తాయి.

ఇకపోతే రజనీ ఈ మధ్య కాలంలో తీసిన ఏ ఒక్క సినిమా కూడా అంత పెద్ద హిట్ ను అందుకోలేక పోవడం నిజంగా నిరాశ కలిగించే విషయం. అయితే మొన్నకు మొన్న పెద్దన్న అనే సినిమా వచ్చినప్పటికీ అది కూడా ఊహించని రీతిలో ప్లాప్ అయ్యి, ఆయన అభిమానులను ఆవేదనకు గురి చేసింది. జయాపజయాలను ఒక్కటే విధంగా చూసే రజనీ కాంత్, ప్రస్తుతం తన నెక్స్ట్ తీయబోయే సినిమాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవలే తన 169 వ మూవీని ప్రకటించి, ప్రేక్షకుల్లో మళ్ళీ ఒక ఆశను చిగురింప జేశారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఈ సినిమా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కనుందని సమాచారం. తాజాగా ఈ దర్శకుడు, స్టార్ట్ హీరో విజయ్ తో కలిసి బీస్ట్ అనే మూవీకి కూడా దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. దీంతో ఈయన రజనీ కాంత్ తో తీయబోయే సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్స్ విషయానికొస్తే ఐశ్వర్యా రాయ్, ప్రియాంక అరుల్ మోహన్ లుగా అనుకున్నట్టు తెలుస్తోంది. ఇంకో విశేషం ఏమిటంటే, రజనీ కాంత్ కి జోడీగా మాత్రం ఐశ్వర్యా రాయ్ నటిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రోబో చిత్రం ఎంత భారీ విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. ఇక తాజాగా వెలువడిన ఈ ప్రకటనతో మళ్ళీ వీళ్ళ కాంబో కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఇరువురి అభిమానులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.