తలైవా.. ఈసారైనా హిట్ కొట్టేనా?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సక్సెస్ చూసి చాలా కాలం అయింది. 2010లో వచ్చిన రోబో సినిమా తర్వాత మళ్లీ ఆయన బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ అయితే అందుకోలేకపోయారు. ఎన్నో విభిన్నమైన సినిమాలు మాస్ కమర్షియల్ సినిమాలు చేశారు. కానీ ఏవి పూర్తిస్థాయిలో ఫ్యాన్స్ ను అయితే సంతృప్తి పరచలేకపోయాయి.

లింగ, కబాలి, కాల వరుసగా నిరాశపరిచాయి. ఇక తర్వాత తన కెరీర్లో బిగ్గెస్ట్ సక్సెస్ ఇచ్చిన శంకర్ తో చేసిన 2.0 కూడా అంతగా అంచనాలను అందుకోలేకపోయింది. ఇక తర్వాత వచ్చిన పేట, దర్బార్, అన్నత్తై మూడు కూడా బాక్సాఫీస్ వద్ద చాలా నష్టాలను గెలిచాయి. ఒకవైపు సీనియర్ దర్శకులను మరొకవైపు యువ దర్శకులతో కూడా సినిమాలు చేస్తున్న రజనీకాంత్ గతంలో మాదిరిగా అయితే బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం లేదు.

ఇక ఇప్పుడు జైలర్ తోనే ఆయన మంచి సక్సెస్ అందుకొని ట్రాక్ లోకి రావాలి అని చూస్తున్నారు. ఏడు పదుల వయసులో కూడా సూపర్ స్టార్ ఈ సినిమాను జెట్ స్పీడ్ లోనే ఫినిష్ చేశారు. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాపై ఇప్పటివరకు అనుకున్నంత స్థాయిలో అయితే హైప్ రాలేదు.

కానీ తప్పకుండా సినిమా సక్సెస్ అవుతుంది అని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. ఇప్పటివరకు కేవలం తమన్నా కావాలయ్యా పాట మాత్రమే ఎంతో కొంత బజ్ క్రియేట్ చేసింది. ఇక ఆగస్టు 10వ తేదీన ఈ సినిమా భోళా శంకర్ తో పోటీ పడుతూ థియేటర్లోకి రాబోతోంది. మరి వరుస ఫ్లాప్స్ అందుకున్న సూపర్ స్టార్ కు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.