తన చిరకాల కోరిక నెరవేర్చుకోలేకపోయిన రాజేంద్ర ప్రసాద్…?

హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో వందల సినిమాలలో నటించి నటకిరీటి అన్న బిరుదు పొందిన రాజేంద్రప్రసాద్ గురించి తెలియని వారంటూ ఉండరు. కామెడీ హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన రాజేంద్రప్రసాద్ హీరోగా బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటించి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్నాడు. ఇలా హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న రాజేంద్రప్రసాద్ తన సినీ జీవితంలో ఎంతో ఆనందంగా ఉన్నాడు. అయితే రాజేంద్రప్రసాద్ ఇప్పటికీ తన చిరకాల కోరికను నెరవేర్చుకోలేక పోయానన్న బాధ వెంటాడుతున్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం ఏమిటంటే… సాధారణంగా ఎంతోమంది హీరో హీరోయిన్ల వరుసలు ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరో హీరోయిన్లుగా బాగా ఫేమస్ అయ్యారు. అందరి హీరోల లాగే రాజేంద్రప్రసాద్ కూడా తన కుమారుడు బాలాజీ ప్రసాద్ ని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావించాడు. ఈ క్రమంలో బాలాజీ ప్రసాద్ హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి ఒకటి రెండు సార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ అవి విఫలం అయ్యాయి. అలాగే రామోజీరావు కూడా బాలాజీ ప్రసాద్ ని ఎలాగైనా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు కూడా విఫలం అయ్యాయి.

అంతేకాకుండా బాలాజీ ప్రసాద్ హీరో మెటీరియల్ కాదని కొందరు వ్యాఖ్యలు చేయడంతో ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ కాకపోతే తన తండ్రి ఇమేజ్ డామేజ్ అవుతుందని భావించిన బాలాజీ ప్రసాద్ ..ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాలన్న ఆలోచనలను వదిలేసి వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం బాలాజీ ప్రసాద్ వ్యాపార రంగంలో దూసుకుపోతున్నాడు. అయితే తన కుమారుడు మంచి వ్యాపారవేత్తగా కొనసాగుతున్నప్పటికీ రాజేంద్రప్రసాద్ కి మాత్రం తన కొడుకుని హీరోని చేయలేకపోయాను అనే బాధ ఇప్పటికీ వెంటాడుతోంది. అందరిలాగే తన కొడుకును కూడా హీరోగా చూసుకోవాలనుకున్న రాజేంద్ర ప్రసాద్ చిరకాల కోరిక మాత్రం తీరకుండా ఉండిపోయింది.